సైరాలో విజయ్ పాత్ర ఏంటో తెలుసా..?

చిరంజీవి 151వ చిత్రంగా తెరకెక్కుతోంది ‘సైరా’. బ్రిటిష్ వారితో స్వాతంత్రం కోసం పోరాడే వీరుడిగా ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి పాత్రలో చిరు నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ తో పాటు కోలీవుడ్ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు. అయితే ఇప్పటివరకు ఇందులో విజయ్ పాత్ర ఎలా ఉంటాదో అన్న వార్తలు మాత్రం బయటికి రాలేదు. కానీ లేటెస్ట్ గా విజయ్ పాత్రకు సంబంధించిన ఓ అప్ డేట్ వచ్చింది.

విజయ్ అయితే మేలని…

విజయ్ సేతుపతి… సైరాలో తమిళుడి పాత్రలో నటించనున్నాడట. చిరుకి కుడి భుజంగా ఉంటూ బ్రిటీష్ వారితో పోరాడుతాడట. ఇది తమిళుడి పాత్ర కాబట్టి యూనిట్ మొత్తం విజయ్ కే ఓటు వేసిందని సమాచారం. ప్రస్తుతం విజయ్ కోలీవుడ్ లో మోస్ట్ బిజీ హీరో. అతని నటనకు తెలుగులో చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే విజయ్ అయితే మన తెలుగు వాళ్లు కూడా యాక్సప్ట్ చేస్తారని ఆయన్ని తీసుకున్నట్టు తెలుస్తుంది.

సినిమాకే హైలెట్ గా…

ఈ సినిమాలో విజయ్ తన పాత్ర నచ్చి ఏమి ఆలోచించకుండా సైన్ చేశాడట. చిరంజీవి, విజయ్ మధ్య వచ్చే సీన్స్ సినిమాకే హైలైట్ అని చెబుతున్నారు. ఇతనికి సంబంధించి ఫస్ట్ లుక్ త్వరలోనే విడుదల చేయనుంది యూనిట్. మరి విజయ్ పాత్ర ఇందులో ఎలా ఉంటుందో చూడాలంటే 2019 సమ్మర్ వరకు ఆగాల్సిందే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*