రెండు రోజుల్లో 110 కోట్లు

దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘సర్కార్’ చిత్రం తమిళం తో పాటు తెలుగులో కూడా రిలీజ్ అయింది. నవంబర్ 6న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. మురగదాస్ – విజయ్ కాంబినేషన్ లో వచ్చిన ఈసినిమా కలెక్షన్స్ పరంగా కొత్త రికార్డులను సృష్టిస్తుంది. తెలుగులో డివైడ్ టాక్ తో నడుస్తున్న ఈసినిమా తమిళనాట మాత్రం బాక్సాఫిస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది.

మొదటి రోజు హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో భారీ గా రాబట్టిన ఈ చిత్రం రెండో రోజు కూడా అదే జోరును కొనసాగించింది. కేవలం రెండు రోజుల్లో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 110 కోట్ల గ్రాస్ మార్క్ ను క్రాస్ చేసి రికార్డు సృటించిందని టాక్. పైగా నిన్న సెలవు కావడంతో ఈసినిమాకు కలిసొచ్చింది.

తెలుగులో డివైడ్ టాక్ వచ్చినప్పటికి ఇక్కడ కూడా మంచి వసూళ్లను రాబడుతుంది. సుమారు గా ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం ఫుల్ రన్ లో ఆ మొత్తాన్ని రాబట్టడం ఖాయం గా కనిపిస్తుంది. రీసెంట్ గా ఈసినిమాను మహేష్ బాబు చూసి టీంకు కంగ్రాట్స్ చెప్పారు

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*