సర్కార్ టాక్ తో సంబంధమే లేదండి

విజయ్ సర్కార్ చిత్రం, టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ – కీర్తి సురేష్ జంటగా నటించిన సర్కార్ చిత్రం గత మంగళవారం వీక్ మిడిల్ లో విడుదలయింది. అయినప్పటికీ… దీపావళికి రెండు మూడు రోజులు సెలవు రావడంతో విజయ్ సర్కార్ టికెట్ బుకింగ్స్ బావున్నాయి. అయితే సర్కార్ మొదటి షోకే తెలుగు రాష్ట్రాల్లో యావరేజ్, కాదు కాదు నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. అయినప్పటికీ… సర్కార్ కలెక్షన్స్ తెలుగు రాష్ట్రాల్లో బావున్నాయి. 7.50 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగితే.. రెండు రోజుల్లోనే 4 కోట్లు కొల్లగొట్టేసింది. ఇంకా లాంగ్ వీకెండ్ ఉండనే ఉంది. మరి ఫస్ట్ వీకెండ్ లో సర్కార్ మూవీ తన బెంచ్ మార్క్ ను అందుకున్నా అందుకోగలదు. మరి మీరు చూడండి రెండు తెలుగు రాష్ట్రాల్లో సర్కార్ కోల్లగొట్టిన కలెక్షన్స్….

ఏరియా: షేర్స్ (కోట్లలో)
నైజాం 0.73
సీడెడ్ 0.97
అర్బన్ ఏరియాస్ 0.30
గుంటూరు 0.50
ఈస్ట్ గోదావరి 0.32
వెస్ట్ గోదావరి 0.29
కృష్ణ 0.38
నెల్లూరు 0.17

టోటల్ ఏపీ అండ్ టీఎస్ షేర్స్ 4.34 కోట్లు

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*