మొదటి రోజు దుమ్ముదులిపిందిగా..!

విజయ్ – మురుగదాస్ కాంబోలో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కిన సర్కార్ చిత్రం నిన్న వరల్డ్ వైడ్ గా విడుదలైంది. మొదటి రోజు భారీ లెవల్లో అత్యధిక థియేటర్స్ లో విడుదలైన సర్కార్ మూవీ యావరేజ్ టాక్ తో థియేటర్స్ లో రన్ అవుతుంది. మురుగదాస్ గత సినిమాలతో పోలిస్తే సర్కార్ మూవీకి నెగెటివ్ టాకే వచ్చింది. అయితే టాక్ తో సంబంధం లేకుండా విజయ్ క్రేజ్ మురుగదాస్ డైరెక్షన్ మీదున్న ఆసక్తితో సర్కార్ సినిమాకి మొదటి రోజు ఓపెనింగ్ భారీగా వచ్చాయి. తమిళనాట అయితే సర్కార్ మూవీ మొదటిరోజు రికార్డు కలెక్షన్స్ కొల్లగొట్టింది.

రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్‌

ఒక్క చెన్నైలోనే భారీ మొత్తంలో అంటే రికార్డు స్థాయిలో 2.37కోట్ల వసూళ్లను రాబట్టి అంతకుముందు ఉన్న రికార్డును బద్దలు కొట్టింది. విజయ్ వన్ మ్యాన్ షోగా నడిచిన ఈ సినిమాని విజయ్ అభిమానులు ఆకాశానికెత్తేస్తున్నారు. విజయ్ స్టైలిష్ నటన, డాన్స్ లు అన్ని తమిళ ప్రేక్షకులకు బాగానే నచ్చాయి. కానీ తెలుగు ప్రేక్షకులు విజయ్ చేసిన ఓవరేక్షన్ ని మెచ్చలేకపోయారు. ఇక హీరోయిన్ పాత్రకి ప్రాధాన్యత లేకుండా చేసిన మురుగదాస్ మహానటి తో క్రేజ్ తెచ్చుకున్న కీర్తి సురేష్ ని ఏమాత్రం ఉపయోగించుకోలేకపోయాడు. దానితో కీర్తి సురేష్ ఈ సినిమాలో కూరలో కరివేపాకు మాదిరి ఉండిపోయింది.

ధీమాతో ఉన్న అభిమానులు…

ఇక విజయ్ – వరలక్ష్మి శరత్ కుమార్ మధ్య పొలిటికల్ వార్ ఆకట్టుకునేలా ఉండడం, సినిమాటోగ్రఫీ అదిరిపోవడంతో పాటుగా ఏఆర్ రెహ్మాన్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్రాణం పోసింది. పాటల్లో పస లేకపోయినా రెహ్మాన్ బ్యాగ్రౌండ్ స్కోర్ తోనే సినిమాని చాలా వరకు నిలబెట్టాడు. మరి విజయ్ స్టామినా.. మురుగదాస్ డైరెక్షన్ మీదున్న క్రేజ్ అన్ని కలిసి సర్కార్ ని బయటపడేస్తుందనే ధీమాతో విజయ్ అభిమానులు ఉన్నారు.

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*