సూర్య అవుట్.. విజయ్ కి కలిసొచ్చింది..!

హరి – సూర్య కాంబోలో సింగం సీరీస్ లో రెండు పార్ట్ లు అదరగొట్టగా.. మూడో పార్ట్ మాత్రం సో సో గా ఆడింది. ఇక సూర్య ఈ ఏడాది మొదట్లో గ్యాంగ్ సినిమాతో రాగా అది అంతే యావరేజ్ టాక్ తెచ్చుకుంది. అయితే సూర్య సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా… సూర్య సినిమా విడుదలవుతుంది అంతే భారీ అంచనాలుంటాయి. అందులోనూ విలక్షణ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ అయిన సెల్వ రాఘవన్ దర్శకత్వంలో ఎంజికె సినిమా చేస్తున్నాడు సూర్య. అయితే క్రేజీ కాంబోలో వస్తున్న ఆ సినిమాని మురుగదాస్ – విజయ్ కాంబోలో తెరకెక్కుతున్న సర్కార్ కి పోటీగా తమిళులకు అతి ముఖ్యమైన దీపావళి రోజున తెలుగు, తమిళంలో విడుదల చేస్తున్నట్లుగా మేకర్స్ ఎప్పుడో డేట్ ఇచ్చేసారు. అయితే విజయ్, సూర్యల మధ్య రసవత్తర పోటీ ఉంటుందని.. కాకపొతే రెండు భారీ ప్రాజెక్టులు ఒకేసారి పోటీకి దిగడం కరెక్ట్ కాదేమో అన్నారు. ఎందుకంటే విజయ్ సర్కార్ మీద కూడా భారీ అంచనాలున్నాయి. తుపాకీ, కత్తి సినిమాల హిట్ క్రేజీ కాంబో మురుగదాస్ – విజయ్ ది. అలాంటి సినిమా సూర్య ఎంజికెతో పోటీ అనేసరికి అందరూ కాస్త టెన్షన్ ఫీల్ అయ్యారు.

సర్కార్ కి కలిసివచ్చినట్లే..!

కానీ తాజాగా సూర్య – సెల్వ రాఘవన్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా భారీతనంతో కూడుకున్నదని.. అయితే ఈ సినిమా పూర్తి చేయడానికి మరింత సమయం అవసరమని.. అందుకే ఈ సినిమా దీపావళికి ఎంజీకే విడుదల కావడం లేదని ఈ సినిమా మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ సినిమా దివాళీ రేస్ నుండి తప్పుకుని విజయ్ సినిమాకి రాజమార్గం వేసింది. రెండు సినిమాలు బరిలో ఉంటె కలెక్షన్స్ రెండు సినిమాలు కు చీలిపోయేవి. కానీ ఇప్పుడు ఎంజీకె తప్పుకోవడం విజయ్ సర్కార్ కి కలిసొచ్చింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*