నిర్మాతలది ఒక తీరు..విజయ్ ది మరో తీరు..!

ప్రస్తుతం విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’, ‘గీత గోవిందం’ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. కానీ బయటికి చాలా హ్యాపీగా కనపడుతున్నా లోపల మాత్రం చాలా ఆందోళనగా ఉన్నట్టు తెలుస్తోంది. ‘గీత గోవిందం’ కన్నా ముందు రిలీజ్ అవ్వాల్సిన ‘టాక్సీవాలా’ ఇంకా రిలీజ్ కాలేదు. ఏవేవో కారణాలు చెప్పి రిలీజ్ ను వాయిదా వేస్తున్నారు. మరోపక్క ఇది టిపికల్ స్టైల్లో రూపొందిన సినిమా కాబట్టి అందరూ కనెక్ట్ కాకపోవొచ్చు అనే డౌట్ హీరో నుండి నిర్మాతల వరకూ అందరికీ ఉందంట.

విజయ్ నిర్ణయానికి నో చెబుతున్న నిర్మాతలు…

అయినా నిర్మాతలు ‘గీత గోవిందం’ సక్సెస్ చూపుతూ ‘టాక్సీవాలా’ని అమ్మాలని చూస్తున్నారట. అయితే హీరో విజయ్ మాత్రం దీన్ని నేరుగా డిజిటల్ ప్లాట్ ఫాంలో రిలీజ్ చేద్దాం అని చెప్పాడట. కానీ నిర్మాతలు అందుకు ఒప్పుకోవడం లేదని తెలుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమా మంచి రేట్స్ కే అమ్ముడవుతుందని నిర్మాతలు నమ్ముతున్నారు. విజయ్ చెప్పినదానికి నో చెప్పారు నిర్మాతలు.

నమ్మకంగా ఉన్న డైరెక్టర్…

పెద్ద నిర్మాణ సంస్థలైన గీతా ఆర్ట్స్, యువి సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ‘టాక్సీవాలా’కు విడుదల విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. థియేటర్స్ కొరత కూడా ఉండదు కాబట్టి క్రేజ్ దృష్ట్యా బిజినెస్ జరుగుతుందని పూర్తి నమ్మకంతో ఉన్నారట నిర్మాతలు. దీనిబట్టి చూస్తుంటే ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ రిలీజ్ అవ్వబోతుంది. పలుమార్లు రీషూట్ తర్వాత డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ ఈ సినిమా అవుట్ ఫుట్ పై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడని టాక్. మరి రిలీజ్ అవ్వుతుందా? లేదా? అన్న విషయాలపై మరో రెండు వారాల్లో ఓ క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్. ఒకవేళ ఇది రిలీజ్ కాకపోతే ‘నోటా’ సినిమా రిలీజ్ కు రెడీ గా ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*