మహేష్ సినిమా టిక్కెట్లు కోసం...
వరుస హిట్లతో దుసుకుపోతున్న విజయ్ దేవరకొండ.. ఇప్పుడు స్టార్ హీరోల ప్రశంసలు అందుకుంటున్నాడు. విజయ్... గీత గోవిందం ఘన విజయం కావడంతో ఇప్పటికే పలువురు అగ్రనటులు విజయ్ కి అభినందనలు తెలిపారు. చిరంజీవి, మహేష్ బాబు, రామ్ చరణ్ వంటి సినీ ప్రముఖులతో పాటు కేటీఆర్, కవిత వంటి రాజకీయ ప్రముఖులు సైతం విజయ్ ని మెచ్చుకున్నారు. ఇటీవల విజయ్... మహేష్ బాబును మహర్షి షూటింగ్ సమయంలో కలిసి ఓ ఫోటో దిగాడు. ఈ చిత్రంలో మహర్షి దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా ఉన్నాడు.
హాలీడే ఎంజాయ్ చేయ్...
ఈ ఫోటోను ట్వీట్ చేస్తూ...‘ఒకప్పుడు మహేష్ సర్ సినిమా టిక్కెట్ల కోసం కోట్లాడటం నుంచి ఇప్పుడు ఆయనతో సినిమా గురించి చర్చిండం చాలా ఆనందంగా ఉందని’ అని వ్యాఖ్యానించాడు. దీనికి మహేష్ బాబు కూడా స్పందించాడు. ‘విజయ్ తో సమయం గడపడం బాగుంది... హాలిడే ఎంజాయ్ చేయి విజయ్’ అని రిప్లై ఇచ్చాడు. మొత్తానికి ఒక యువ హీరోను స్టార్ హీరో మహేష్ బాగా ప్రోత్సహిస్తున్నాడు.
Had a really nice time too... Enjoy your holiday @TheDeverakonda... the time is NOW! 😉 https://t.co/ony1NPZ8Kz
— Mahesh Babu (@urstrulyMahesh) August 24, 2018