విక్రమ్ ని కాపాడేది మహానటేనా?

ఒకప్పుడు ఇటు తెలుగులోనూ.. అటు తమిళంలోను ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్న హీరో విక్రమ్ కు ఈ మధ్య అంతగా కలిసి రావడం లేదు. ఈ మధ్య అతను చేసిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడుతున్నాయి. ప్రస్తుతం అతను చేస్తున్న ‘సామి స్క్వేర్‌’ పైనే ఫుల్ హోప్స్ పెట్టుకున్నాడు. హరి డైరెక్షన్‌లో విక్రమ్‌ చేసిన ‘సామి’ అప్పట్లో బ్లాక్‌బస్టర్‌. తెలుగులోకి ‘లక్ష్మీనరసింహా’గా రీమేక్‌ అయి ఘన విజయాన్ని అందుకుంది. ఇప్పుడు దానికి సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇది కూడా మాస్ ఆడియన్స్ ను మెప్పించే సినిమాగా రూపొందుతుంది. హరి టేకింగ్ అంటే ఫుల్ హడావిడిగా ఉంటుంది. అలానే ఈ సినిమా కూడా ఉండబోతున్నట్టు ట్రైలర్ చూస్తే అర్ధం అవుతుంది.

కీర్తితోనైనా కలిసివస్తుందా..

అయితే ఈ సినిమాలో విక్రమ్ సరసన కీర్తి సురేష్ నటిస్తుంది. రీసెంట్ గా ‘మహానటి’ సినిమాతో ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న కీర్తి.. విక్రమ్‌ బ్యాడ్‌ టైమ్‌కి ఎండ్ కార్డు వేసి మళ్లీ పాత విక్రమ్ ని తెస్తుందేమో చూడాలి. కీర్తి సురేష్ ఈ సినిమాకు ప్లస్ అవుతుందని చిత్ర యూనిట్ నమ్ముతున్నారు. ఇక ‘సామి స్క్వేర్‌’ ను తెలుగులో రీమేక్ ఎవరు చేస్తారన్నది చర్చనీయాంశంగా మారింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*