బాబోయ్ హిట్ అందుకుని అన్నేళ్లయ్యిందా?

తన కెరీర్ స్టార్టింగ్ లో తెలుగులో సక్సెస్ రాకపోవడంతో తమిళనాట వెళ్లి అక్కడ వైవిధ్యభరిత చిత్రాలు చేసి స్టార్‌ అయ్యాడు విక్రమ్. ‘శివపుత్రుడు’, ‘అపరిచితుడు’ వంటి చిత్రాలతో తన టాలెంట్ ని బయట పెట్టిన అది అతనికి ఏమి సక్సెస్ ఇవ్వలేకపోతుంది. ఏమైందో ఏమో ‘అపరిచితుడు’ తర్వాత ఇప్పటివరకు విక్రమ్ ఒక హిట్ సినిమా కూడా లేదు. ‘అపరిచితుడు’ వచ్చి పదమూడేళ్ళ అవుతున్న సరయిన హిట్‌ లేదు.

శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఐ’ కూడా విక్రమ్ కు సక్సెస్ ఇవ్వలేకపోయింది. మధ్యలో వచ్చిన ‘నానా’ తో పర్లేదు అనిపించుకున్నాడు తప్ప సక్సెస్ అయితే అందుకోలేకపోయారు. రీసెంట్ గా వచ్చిన ‘స్కెచ్‌’ కూడా నిరాశకు గురిచేసింది. ఇక మొన్న శుక్రవారం రోజు విడుదలైన ‘సామి స్క్వేర్‌’ కూడా డిజాస్టర్ గా నిలవడంతో విక్రమ్ ఫ్యాన్స్ తల పట్టుకుంటున్నారు.

అంతేకాకుండా యాభై రెండేళ్ల వయసులో విక్రమ్‌ మునుపటి గ్లామర్‌ కూడా కోల్పోయాడు. ఈసినిమాలో కీర్తి సురేష్ పక్కన చాలా పెద్దవాడిలా అనిపించాడు. వయసు మళ్లిన వాడిలా కనిపించాడు. మరి ఎందుకని విక్రమ్ ఇన్ని ఏళ్ళు అవుతున్న సరైన సక్సెస్ ని అందుకోలేక పోతున్నాడో అర్ధం కావట్లేదు. మరోపక్క విక్రమ్ కొడుకు ధ్రువ సినీ రంగ ప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. మరి గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో చేస్తోన్న ‘ధృవ నచ్చిత్రమ్‌’ చిత్రంతో ఐన విక్రమ్ కు హిట్ వస్తుందేమో చూడాలి

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*