మాస్ దేవుళ్ళు నిలబెడతారంటారా?

Vinaya Vidheya rama in disaster list

వరల్డ్ వైడ్ గా ప్రేక్షకులముందుకు వచ్చిన రామ్ చరణ్ వినయ విధేయరామ సినిమా మిక్స్డ్ టాక్ తో థియేటర్స్ లో సందడి చేస్తుంది. రామ్ చరణ్ – కైరా అద్వానీ జంటగా బోయపాటి తెరకెక్కించిన ఈ సినిమా కేవలం మాస్ ప్రేక్షకులను అలరించేదిగా.. మెగా ఫాన్స్ ని ఆకట్టుకునేలా ఉందని ప్రేక్షకులతో పాటుగా రివ్యూ రైటర్స్ కూడా తీర్పునిచ్చారు. రామ్ చరణ్ మాస్ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ తప్ప సినిమాలో ఏం లేవని.. బోయపాటి యాక్షన్ మరీ ఎక్కువైందని అంటున్నారు. కథ, కథనం మీద బోయపాటి శ్రద్ద పెట్టలేదని.. కేవలం ఫైట్స్ మీదేశ్రద్ద పెట్టడం వలన రామ్ చరణ్ కి ఇలాంటి పరిస్థితి వచ్చిందని అంటున్నారు.

vinaya vidheya rama telugu post telugu  news

ఏ రకంగానూ ఫ్యామిలీ ఆడియన్స్ ని, క్లాస్ ఆడియన్స్ ని వినయ విధేయరామ ఆకట్టుకోదని.. కేవలం మాస్ అండ్ బిసి సెంటర్స్ ఆడియన్స్ కి మాత్రమే ఈ సినిమా అంటూ అందరూ పెదవి విరుస్తున్నారు. బోయపాటి మాస్ డైరెక్టర్ అయినా.. ఎప్పుడూ కథను నెగ్లెట్ చెయ్యలేదని…. కానీ వినయ విధేయరామాలో కథ మైనస్ అవడం బ్యాడ్ స్క్రీన్ ప్లే కి తోడు, దేవిశ్రీ మ్యూజిక్ ఆకట్టుకోలేదని… ఇంకా ఎడిటింగ్ వీక్ గా ఉందని స్టార్ క్యాస్ట్ ని బోయపాటి సరిగ్గా వాడుకోలేకపోయాడని… అందరూ చెబుతున్న మాట. కేవలం రామ్ చరణ్ యాక్షన్ లుక్, టాటూ బాడీ లుక్ ఆకట్టుకునేలా ఉండడం.. చరణ్ డాన్స్ లు బావున్నాయంటున్నారు.

vinaya vidheya rama new look telugu news

మరి సినిమా కేవలం మాస్ ఆడియన్స్ కోసమే తీసినట్టుగా ఉండడం.. రామ్ చరణ్ రంగస్థలంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటే… ఆ స్థాయి అంచనాలతో విడుదలైన వినయ విధేయరామ ఏమాత్రం రంగస్థలం అంచనాలను అందుకోలేకపోయింది. మరి మాస్ ప్రేక్షకులు తలచుకున్నా వినయ విధేయకు కలెక్షన్స్ రావడం కష్టమంటున్నారు. ఎందుకంటే… రామ్ చరణ్ సంక్రాతి పండక్కి చాలా గట్టి పోటితోనే బరిలో దిగాడు. ఒక పక్క ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు, మరోవైపు ఎఫ్ టు కామెడీ ఎంటెర్టైనెర్ మధ్యలో ఉండడం…. ప్రేక్షకులు ఈ సంక్రాంతికి కోడి పందేలు.. సంక్రాతి సంబరాలు అంటూ ఎవరి హడావిడిలో వారు ఉండడంతో.. రామ్ చరణ్ వినయ విధేయరామకి మాస్ కలెక్షన్స్ కూడా అనుమానమే అంటున్నారు

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*