సరైనోడు మాదిరిగానే.. వినయ విధేయ కూడా.

బోయపాటి – రామ్ చరణ్ ల కలయికలో మొదటిసారిగా తెరకెక్కిన వినయ విధేయరామ ప్రస్తుతం థియేటర్స్ లోకొచ్చేసింది. సంక్రాతి కానుకగా ప్రేక్షకులముందుకు వచ్చిన వినయ విధేయరామ అభిమానుల అంచనాలను అందుకుంది. కానీ… ట్రేడ్ అండ్ ప్రేక్షకుల అంచనాలను పూర్తిగా అందుకోలేకపోయింది. పక్కా మాస్ ఎంటెర్టైనెర్ గా యాక్షన్ ప్రధానాంశంగానే సినిమా మొత్తం కనబడింది కానీ.. కథకు ప్రాధాన్యత లేదు. ఎప్పటిలాగే బోయపాటి తమ మార్క్ యాక్షన్ ని ఒకింత ఎక్కువే చూపించాడు. ఎప్పుడూ ఎక్కువగా యాక్షన్ ఫార్ములాతోనే బోయపాటి తన సినిమాలను తెరకెక్కిస్తాడు. అయితే కథతో పాటుగా యాక్షన్ చూపెట్టే బోయపాటి ఈసారి మాత్రం కథను కథనాన్ని విస్మరించాడు. కేవలం యాక్షన్ ని మాత్రమే హైలెట్ చేస్తూ పోయాడు.

కేవలం ప్రేక్షకులే కాదు.. రివ్యూ రైటర్స్ కూడా వినయ విధేయరామకి పూర్ రేటింగ్స్ ఇచ్చారు. రామ్ చరణ్ హీరోయిజం, డాన్స్ లు, కొన్ని యాక్షన్ సీన్స్, సినిమాటోగ్రఫీ తప్ప సినిమా లో చెప్పుకోవడానికి ఏం లేవని ముక్త ఖంఠంతో తేల్చేశారు. అయితే గతంలో అల్లు అర్జున్ – బోయపాటి కాంబోలో వచ్చిన సరైనోడు సినిమాకి కూడా ఇలాంటి రివ్యూస్ వచ్చాయి. బాగా మాస్ సీన్స్ ఉన్నాయని.. మరీ ఎక్కువగా నరకడం మీదే బోయపాటి దృష్టి పెట్టాడని.. కేవలం అల్లు అర్జున్ తప్ప ఆ సినిమాలో పెద్దగా ఆకట్టుకునేదిగా ఏది లేదని క్రిటిక్స్ కూడా అన్నారు.

vinaya vidheya rama new look telugu news

కానీ సరైనోడు బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ తో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. రివ్యూస్ ని కూడా పక్కన పెట్టేసి సినిమా హిట్ అయ్యింది. అల్లు అర్జున్ సరైనోడుతో సూపర్ హిట్ ని ఖాతాలో వేసుకున్నాడు. ఇక మాస్ అండ్ బిసి సెంటర్స్ ప్రేక్షకులు సరైనోడు సినిమాని హిట్ చేసినట్లుగా ఇప్పుడు వినయ విధేయరామని కూడా మాస్ ప్రేక్షకులు హిట్ చేస్తారా.. ఎందుకంటే బ్యాడ్ రివ్యూస్ తో బోయపాటి కెరీర్ లోనే ఇలాంటి ప్లాప్ సినిమా ఉండదని… చెప్పే క్లాస్ ప్రేక్షకుడి నోరు వినయ విధేయరామ కలెక్షన్స్ మూపిస్తాయేమో చూడాలి.

vinaya vidheya rama fight budget

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*