వినయ విధేయ రామ: భయపెట్టాలా… చంపేయాలా…!

movies releases in sankranthi festval

రామ్ చరణ్ లుక్, టైటిల్ దీపావళి ముందు వదిలిన బోయపాటి.. దీపావళి అలా వెళ్లిందో లేదో ఇలా వినయ విధేయ రామ టీజర్ ని విడుదల చేసి మెగా అభిమానులను హ్యాపీ చేశాడు. మరి బోయపాటి టైటిల్స్ సాఫ్ట్ గా ఉన్నా అయన సినిమాల్లో మాస్ ఎలెమెంట్స్ కి కొదవలేదనేది రామ్ చరణ్ వినయ విధేయ రామ ఫస్ట్ లుక్ లోనే తెలిసింది. మాస్ లుక్ లో రామ్ చరణ్ పరిగెత్తుకొస్తుంటే.. మాస్ కాదు బాబోయ్ ఊర మాస్ చరణ్ అన్నారు. ఇక ఫస్ట్ లుక్ ని, టైటిల్ ని వదలడంలో లేట్ చేసినా… టీజర్ విషయంలో మాత్రం ఎటువంటి డిలే చెయ్యలేదు బోయపాటి… అనుకున్న టైంకి అనుకున్నట్టుగా టీజర్ వదిలేశాడు.

బోయపాటి మార్క్ హీరోయిజం

ఇక వినయ విధేయ రామ టీజర్ లో హీరోయిజాన్ని ఎంతగా చూపెట్టాలో అంతగా చూపెట్టేసాడు బోయపాటి. రామ్ చరణ్ విశ్వరూపాన్ని ఈ టీజర్ తో పరిచయం చేసాడు. రామ్ చరణ్ ని చాలా స్టైలిష్ గా చూపిస్తూనే.. అందులోనే మాస్ ని దించేశాడు. వివేక్ ఒబెరాయ్ మాత్రం స్టైలిష్ విలన్ గా విలనిజాన్ని పండించబోతున్నాడనేది టీజర్ చూస్తుంటే తెలుస్తుంది. ఇక చరణ్…. అన్నా వీడిని భయపెట్టాలా… చంపేయాలా… భయపెట్టడానికైతే పది నిమిషాలు.. చంపేయాలంటే పావు గంట. ఏదైనా ఓకే… సెలెక్ట్ చేసుకో అంటూ చెప్పే మాస్ డైలాగ్ థియేటర్స్ లో విజిల్ వేయించడం ఖాయమంటున్నారు. ఇక ప్రశాంత్, ఆర్యన్ రాజేష్ లు కూడా ఈ టీజర్ లో చరణ్ అన్నలుగా పరిచయమయ్యారు.

అదరగొట్టే డైలాగులతో…

చరణ్ చేతిలో ఆయుధంతో.. మాస్ గా కనబడుతూనే మాస్ డైలాగ్ తో రెచ్చిపోయాడు. టీజర్ చివరిలో రామ్ చరణ్ చెప్పిన డైలాగ్ అయితే మెగా ఫాన్స్ కి పూనకలొచ్చేస్తున్నాయి. రామ్ చరణ్ స్టైలిష్ గా ప్రశాంత్, ఆర్యన్ రాజేష్ లతో నడిచోస్తూ… ప్రశాంత్ దగ్గర నుండి రేయ్ నువ్వు పందెం పరశురామ్ అయితే ఏంట్రా.. ఇక్కడ రామ్ కొణిదెల అంటూ చరణ్ బల్లగుడ్డుతూ చెప్పిన డైలాగ్ అదిరింది అంతే. మరి ఈ టీజర్ మొత్తం బోయపాటి మార్క్ తోనే  బయటికి వచ్చింది. హీరోయిన్ తో రొమాంటిక్ సీన్స్ గానీ… ఫ్యామిలీ డ్రామాను గానీ టచ్ చేయకుండా… కేవలం యాక్షన్, ఎమోషన్ మీదే టీజర్ కట్ చేశారు. ఇక కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీ సంగీతం అందిస్తున్నాడు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*