పాపం వినాయక్?

ప్రస్తుతం దర్శకుడు వి వి వినాయక్ కి బ్యాడ్ టైం నడుస్తుంది. ఖైదీ నెంబర్ 150 తో హిట్ కొట్టిన వినాయక్ ఆ సినిమా వలన ఒరిగింది ఏమి లేదు. ఎందుకంటే ఆ విజయం మొత్తం చిరు ఖాతాలోకి వెళ్ళిపోయింది. ఇక తరవాత సాయి ధరమ్ తేజ్ డైరెక్షన్ లో చేసిన ఇంటిలిజెంట్ కూడా ఘోరమైన ప్లాప్ అయ్యింది. ఇక వినాయక్ పని అవుట్ అని అనుకుంటున్న సమయంలో.. నిర్మాత సి కళ్యాణ్ బాలకృష్ణ తో విజయక్ డైరెక్షన్ లో ఒక సినిమా అంటూ ప్రకటించాడు. కానీ బాలయ్య నుండి ఎటువంటి స్పందన లేదు. అయితే ఈలోపు బాలకృష్ణ ఎన్టీఆర్ బయో సినిమా చెయ్యాలని నిర్ణయించుకోవడం ఆ పనులను మదలెట్టడం మధ్యలో గ్యాప్ రావడంతో వినాయక్ తో బాలయ్య సినిమా పట్టాలెక్కుతోంది అనుకున్నారు.

కానీ బాలయ్య క్రిష్ డైరెక్షన్ ఎన్టీఆర్ సినిమాని త్వరలోనే మొదలెట్టబోతున్నాడు. అలాగే ఎన్టీఆర్ బయో పిక్ తర్వాత అయినా వినాయక్ సినిమా పట్టాలెక్కుతోంది అనుకుంటే.. తర్వాతి లిస్ట్ లోకి బోయపాటి వచ్చి చేరాడు. బోయపాటి శ్రీను.. లెజెండ్ దగ్గరనుండి మరో మూవీని బాలయ్య హీరోగా చెయ్యాలనే కసితో ఉన్నాడు. కానీ బాలయ్య మాత్రం ఇదిగో అదిగో అంటున్నాడు. తాజాగా ఇండో అమెరికన్‌ బసవతారకం క్యాన్సర్‌ హాస్పిటల్’లో జరిగిన వేడుకల్లో బాలకృష్ణ మాటల మధ్యలో ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత దర్శకుడు బోయపాటి శ్రీనుతో తన తర్వాతి చిత్రం ఉంటుందని చెప్పి వినాయక్ ని కన్ఫ్యూజన్ లో పడేసాడు.

పాపం వినాయక్ బాలయ్యతో సినిమా కోసం కాచుకుని కూర్చున్నాడు. అయితే వినాయక్, బాలయ్య కోసం ఇంకా కథ ప్రిపేర్ చెయ్యకపోవడం వలెనే బాలకృష్ణ తర్వాతి చిత్రాన్ని బోయపాటి తో చెయ్యదలిచాడనే టాక్ నడస్తుంది. పాపం అసలే కష్టాల్లో ఉన్న వినాయక్ ఇప్పుడు బాలయ్య డెసిషన్ తో మరింతగా కష్టాల్లోకి వెళ్ళిపోయాడు. అసలే బాలయ్య పుట్టినరోజుకి తన డైరెక్షన్ లో బాలయ్య సినిమా ఉంటుదనే పోస్టర్ తో బాలయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాడు

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*