గర్ల్ ఫ్రెండ్ విలన్ అయ్యింది..!

తెలుగు హీరో అయిన విశాల్ కోలీవుడ్ కి వెళ్లి సెట్టిల్ అయ్యి అక్కడ హీరోగా, నిర్మాతగా, నడిగార్ సంఘం కార్యదర్శిగా, నిర్మాతల మండలి అధ్యక్షుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఎంత బిజీగా ఉన్నా పెళ్లి ఎప్పుడు అన్న మాట వచ్చేసరికి ఏదో ఒక కారణం చెప్పి సైడ్ అయ్యేవాడు. కానీ రీసెంట్ గా అక్కడ మీడియా మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అని వేసిన‌ ప్రశ్న విశాల్ ని అడిగితే తనలో తానే ముసిముసిగా నవ్వేసుకుంటూ అసలు ఈ పెళ్లి గోలేంటో! అనేసుకుంటాడు.అతను ఆలా అనడానికి కారణం వెనక పెద్ద కథే ఉంది. కొన్నేళ్ల‌ క్రితం నుండి విశాల్.. శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి ప్రేమించుకుంటున్న సంగతి తెలిసిందే. వారి ప్రేమకు శరత్ కుమార్ అడ్డుకున్నారనీ తెలిసిందే. `మామ- అల్లుళ్ల` మధ్య ఫిలింఛాంబర్ – నిర్మాతల మండలి – నడిగర సంఘంలో ఎన్నికల వేళ గొడవలయ్యాయని కోలీవుడ్ మీడియా ప్రచారం చేసింది.

ఎన్నిక‌ల్లో ప్ర‌త్య‌ర్థులు కావ‌డంతో…

అక్కడ వీరిద్దరూ నడిగర సంఘం ఎన్నికల్లో పోటీకి దిగారు. విశాల్ ఆ పోటీలో నెగ్గాడు. దాంతో వారి ప్రేమ పెళ్లికి శరత్ కుమార్ మరింత అడ్డొచ్చాడ‌న్న కొత్త ప్రచారం సాగింది. అంతేకాకుండా నడిగార్‌ సంఘం సొంత బిల్డింగ్ కట్టాక అందులో తొలి పెళ్లి నాదే! అని సవాల్ విసిరాడు విశాల్ ఎన్నికల వేళ. దాంతో ప్రస్తుతం వీరి ప్రేమ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఇక విశాల్ `పందెంకోడి 2` సినిమాలో విశాల్ కి విలన్ గా వరలక్ష్మి నటిస్తుంది. మొన్న రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ లో విలనీగా అదిరిపోయింది అంటున్నారు. టీజర్ లోనే అంతలా పెర్ఫార్మ్ చేస్తే ఇంకా సినిమాలో ఎంతలా చేసుంటుందో అని అభిమానుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. సినిమాలో వీరి కాంబినేషన్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*