విశాల్ పై శ్రీరెడ్డి సంచలన ఆరోపణలు

టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ పై వరుస ఆరోపణలు గుప్పిస్తోన్న నటి శ్రీరెడ్డి తాజాగా కోలీవుడ్ ను టార్గెట్ చేసింది. టాలీవుడ్ లో దగ్గుబాటి అభిరామ్, పవన్ కళ్యాణ్, నాని వంటి వారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆమె కోలీవుడ్ లో అగ్ర దర్శకుడు ఏఆర్ మురుగదాస్ తో ఆరోపణలతో మొదలుపెట్టింది. తమిళ్ లీక్స్ పేరుతో ఆమె రాఘవ లారెన్స్, తమిళ నటుడు శ్రీకాంత్ వంటి వారిపై వరుస ఆరోపణలు చేస్తోంది.

అతడితో నాకు ముప్పు…

అయితే, తనకు తమిళ నటుడు, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షుడు విశాల్ తో తనకు ముప్పు ఉందని ఆమె ఆరోపించారు. ఈ మేరకు ఫేస్ బుక్ లో చేసిన ఓ పోస్ట్ లో ‘విశాల్ రెడ్డితో నాకు ముప్పు ఉంది. అయినా, కోలీవుడ్ లోని చీకటి కోణాలను బయటకు తీస్తాను’ అని పేర్కొన్నారు. ఇటీవల విశాల్ శ్రీరెడ్డి వైఖరిని తీవ్రంగా ఖండించిన విషయం తెలిసిందే. అందరి పేర్లపై నేరుగా ఆరోపణలు చేయడం సరికాదని, ఏవైనా ఆధారాలు ఉంటే బయటపెట్టాలని ఆయన శ్రీరెడ్డిని ఉద్దెశించి వ్యాఖ్యానించారు. తనపైనా ఆమె ఆరోపణలు చేస్తుందేమో అని అనుమానించిన విషయం తెలిసిందే.