సీట్ ఎడ్జ్ పై కూర్చుని ఎంజాయ్ చేసే సినిమా..!

బోయపాటి – రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా మీద ట్రేడ్ లో మంచి అంచనాలున్నాయి. రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాక రామ్ చరణ్ మీద అందరిలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక పక్కా మాస్, కమర్షియల్ డైరెక్టర్ బోయపాటి సినిమాలంటే ట్రేడ్ లో మంచి అంచనాలే ఉంటాయి. ప్రస్తుతం రామ్ చరణ్ – బోయపాటిల సినిమా షూటింగ్ యూరప్ లోని అరుదైన లొకేషన్స్ లో జరుగుతుంది. అజర్ బైజాన్ అనే దేశంలో కనీవినీ ఎరుగని లొకేషన్స్ లో షూటింగ్ జరుగుతుంది.

సిక్స్ ప్యాక్ తో రామ్ చరణ్…

అక్కడ చిత్రీకరిస్తున్న యాక్షన్ సీన్స్ సినిమాకే హైలెట్ గా ఉండబోతున్నాయని… అలాగే ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ నటిస్తుండగా, హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తుంది. మాజీ హీరో ఆర్యన్ రాజేష్, తమిళ నటుడు ప్రశాంత్ లు కీ రోల్స్ లో నటిస్తున్నారు. అయితే ఈ సినిమా కుటుంబ కథ చిత్రంగా, మాస్ ఎంటెర్టైనెర్ గా ఉండబోతుందని.. ఈ సినిమాలో రామ్ చరణ్ లుక్, బాడీ లాంగ్వేజ్ అదుర్స్ అనే రేంజ్ లో ప్రచారం జరుగుతుండగా.. తాజాగా రామ్ చరణ్ బ్యాక్ లుక్ ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. మరి చరణ్ బ్యాక్ లుక్ చూస్తుంటే రామ్ చరణ్ మంచి బాడీ ఫిట్నెస్ తో సిక్స్ ప్యాక్ బాడీతో అలరిస్తాడనిపిస్తుంది.

మెగా ప్యాన్స్ ని ఖుష్ చేసిన ట్వీట్…

ఇకపోతే ఈ సినిమా లో విలన్ గా నటిస్తున్న వివేక్ ఒబెరాయ్ ఈ సినిమా గురించి మొదటిసారి స్పందించాడు. అజర్ బైజాన్ దేశం పౌరుషానికి ప్రతీక వంటిది. అలాంటి దేశంలో ఈ సినిమా షూటింగు జరుగుతూ ఉండటం ఆనందంగా ఉందని… మాస్టర్ డైరెక్టర్ బోయపాటి టేకింగ్ ఎంతో గొప్పగా ఉందన్నారు. అలాగే అద్భుతమైన టాలెంట్ చరణ్ సొంతమని.. చరణ్ తో కలిసి నటించడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందన్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే సీట్ ఎడ్జ్ పై కూర్చుని ఎంజాయ్ చేయవలసిన సినిమా ఇది.. ఎదురుచూస్తూ వుండండి.. అంటూ ట్వీటేసాడు. మరి ఈ ట్వీట్ చూసాక మెగా ఫాన్స్ ఆనందం ఒక లెవెల్ కి పెరిగిపోయింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1