వినాయక్ పరిస్థితి ఏంటి ఇలా అయ్యింది!

టాలీవుడ్ లో స్టార్ దర్శకులు అనుకునే వారు చాలా మంది దర్శకులు కొత్త కథలు.. కొత్త కాంబినేష‌న్ల‌తో దూసుకుపుతుంటే.. స్టార్ డైరెక్టర్ వీవీ వినాయక్ మాత్రం ఇంకా చాలా వెనకే ఉండిపోయారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఒక్కప్పుడు ఇండస్ట్రీ హిట్స్ తో పాటు సూపర్ హిట్ చిత్రాలను అందించిన వినాయక్ లేటెస్ట్ గా సాయి ధరమ్ తేజ్ తో `ఇంటిలిజెంట్` అనే సినిమా తీసి మరింత కిందకి వెళ్లిపోయారు.

స్వయంగా కథ రాసుకునే పనిలో…

అయితే ఈ నేపథ్యంలో వినాయక్ బాలకృష్ణతో ఓ సినిమా తీయాల్సి ఉంది. దానికి నిర్మాత సి కళ్యాణ్ కూడా రెడీగా ఉన్నారు. కానీ వినాయక్ కు సరైన కథ దొరకడం లేదంట. గత మూడు నెలల నుండి కథను రెడీ చేసే పనిలోనే ఉన్నాడు వినాయక్. అతని సినిమాలకి అతను స్వంతంగా కథ రాసుకున్న సందర్భాలు లేవు. అతని సినిమాల కథలన్నీ ఎవరైనా రైటర్ దగ్గర నుండి తీసుకున్నవే. సో క‌థ‌ల్ని తానే సొంతంగా త‌యారు చేసుకోలేడు. త‌న స‌మ‌స్య అదే. వినాయక్ కి ఎక్కువ కథలు అందించింది మాత్రం పురుచూరి బ్రదర్స్, ఆకుల శివనే. ఈ మధ్య పరుచూరి బ్రదర్స్ పెద్దగా కథలు విషయంలో ఇంట్రెస్ట్ చూపట్లేదు. ఇక ఆకుల శివ ఈ మధ్య ఇచ్చిన కథలన్నీ బెడ‌సి కొట్ట‌డం మొద‌లెట్టాయి.

వినాయక్ పై అసంతృప్తితో…

దీంతో కొత్త రైటర్స్ నుండి కథలు వింటున్నా అవి ఏవీ వినాయక్ కు నచ్చడం లేదంట. అందుకే ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితిల్లో వినాయక్ ఉన్నాడు. మరోపక్క ప్రొడ్యూసర్ సి.క‌ల్యాణ్ వినాయ‌క్ పైన అసంతృప్తితో ఉన్నాడ‌ట‌. ఇప్పటివరకు ఇంకా కథ రెడీ చేయకపోవడంతో వేరే డైరెక్టర్ ని వెతుక్కోవాల‌ని డిసైడ్ అయ్యాడ‌ట‌. త్వరగా వినాయక్ కథ రెడీ చేయకపోతే బోయ‌పాటి – బాలకృష్ణ సినిమాకి కళ్యాణ్ ప్రొడ్యూసర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. లేదా వేరే దర్శకుడితో వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*