సై రా లో వెడ్డింగ్ భామ..?

దేశంలోని పలు భాషల్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సైరా నరసింహారెడ్డి సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రని పోషిస్తున్నాడు. ఈ సినిమాలో అనేక భాషల నుండి హేమాహేమీలు నటిస్తున్నారు. పలు కీలకపాత్రల్లో అమితాబ్ బచ్చన్, కిచ్చ సుదీప్, విజయ్ సేతుపతి, నయనతార, జగపతిబాబు, సునీల్ ఇంకా చాలామంది నటీనటులు ఈ సినిమా లో భాగమవుతున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మాతగా కొణిదెల ప్రొడక్షన్స్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ చివరిలో కోకాపేట లో వేసిన సెట్ లో షూటింగ్ జరుపుకుంటుంది.

రామ్ చరణ్ ను బతిమాలి మరీ…

అయితే చరిత్రాత్మక చిత్రంగా తెరకెక్కుతూ.. చిరు నటిస్తున్న ఈ సినిమాలో చిన్న అవకాశం వచ్చినా ఎవరు వదలరు. అలాంటిది మెగా డాటర్ నిహారిక వదిలేస్తుందా.. అసలు సైరా ప్రాజెక్ట్ అనుకున్నప్పటి నుండి ఈ మెగా హీరోయిన్ సైరా లో చిన్న పాత్ర వచ్చినా చాలని… అది ఎంతటి చిన్న పాత్ర అయినా ఆ సినిమా లో అవకాశం వస్తే చాలు నటించేస్తానని చెప్పేది. అయితే అప్పటి నుండి నిహారిక ఈ సినిమా లో చేస్తుందనే న్యూస్ వుంది కానీ.. కన్ఫర్మ్ కాలేదు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం నిహారిక కొణిదెల సైరా సినిమాలో నటిస్తుందని చెబుతున్నారు. ఇక సైరాలో తనకి ఒక పాత్ర కావాలని తన అన్న రామ్ చరణ్ కాళ్ల కూడా పట్టుకున్నానని సరదాగా చెబుతుంది.

చిన్న పాత్ర అయినా పెదనాన్న సినిమా కదా…

సైరా లో ఒక గిరిజన యువతిగా నిహారిక కనిపిస్తుందట. ఇక సినిమాలో రెండు .. మూడు సీన్లలో మాత్రమే కనిపించి మాయమయ్యే పాత్రలో నిహారిక కనిపించనుందని అంటున్నారు. మరి అది ఎంత చిన్న పాత్ర అయినా తన పెదనాన్న సినిమా లో నటించడం తన కోరిక అని నిహారిక ఎప్పుడో చెప్పింది. మరి సైరా లో నటించి నిహారిక కున్న క్యూరియాసిటీని, కోరికను తీర్చేసుకుంది. ఇక నిహారిక హీరోయిన్ గా నటించిన హ్యాపీ వెడ్డింగ్ చిత్రం శనివారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సుమంత్ అశ్విన్ తో కలిసి నిహారిక ఈ హ్యాపీ వెడ్డింగ్ సినిమాలో నటించింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*