ప్రతిక్షణం థ్రిల్ చేసే వైఫ్ ఆఫ్ రామ్

మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన సినిమా వైఫ్ ఆఫ్ రామ్. విజయ్ యెలకంటి డైరెక్షన్ లో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ప్రత్యేక అతిథిగా విచ్చేసిన మంచు మోహన్ బాబుతో పాటు ప్రత్యేక ఆహ్వానితులు రకుల్ ప్రీత్ సింగ్, దర్శకుడు వంశీ కృష్ణ, నిర్మాత స్వప్నదత్, ఫ్యాషన్ డిజైనర్ శిల్పా రెడ్డి.. వైఫ్ ఆఫ్ రామ్ ట్రైలర్ లాంచ్ వేడుకలో సినిమా మంచి విజయాన్ని సాధించాలని ఆకాక్షించారు.. వైఫ్ ఆఫ్ రామ్ ట్రైలర్ ను మోహన్ బాబు ఆవిష్కరించారు..ముఖ్య అతిథిగా హాజరైన రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. ‘వైఫ్ ఆఫ్ రామ్ ట్రైలర్ నేనే ముందు చూశాను. నాకు థ్రిల్లర్ జానరంటే ఇష్టం. విజయ్ కి ఇది తొలి సినిమాలా లేదు. నేను సినిమాలో కొన్ని సీన్స్ కూడా చూశాను.. అవన్నీ చాలా చాలా బావున్నాయి. నాకు బాగా నచ్చాయి..’ అని పేర్కొంది.

థ్రిల్ గ్యారెంటీ….

వైఫ్ ఆఫ్ రామ్ ప్రధాన పాత్రధారి మంచు లక్ష్మి మాట్లాడుతూ… ‘క్రమశిక్షణ అనే పునాదులపై పెరిగాం మేం. లోకంలో ఎంత ఎక్కువ క్రియేటివ్ పీపుల్ ఉంటే ప్రపంచం అంత ఎక్కువ అందంగా ఉంటుంది. డైరెక్టర్ విజయ్ లేకపోతే ఈ సినిమాయే లేదు. రెండుమూడు కథలు అనుకున్నాం. ఫైనల్ గా ఈ కథను ఓకే చేశాం. ఏనాడూ బడ్జెట్ గురించి ఒక్క రూపాయి పెంచమని అడగలేదు. తనే ఓ నిర్మాతగా ఆలోచించి మరీ తెరకెక్కించారు. నా ఫ్యామిలీయే నా బ్యాక్ బోన్.. మోహన్ బాబు కూతురుగా కాకుండా నా సొంత ప్రతిభతోనే ఎదిగే ప్రయత్నం చేస్తున్నా.. ఇక సినిమా ప్రతిక్షణం థ్రిల్ చేస్తుందనే గ్యారెంటీ మాత్రం ఇస్తున్నాను.. అతి త్వరలోనే ఈ సినిమా మీ ముందుకు రాబోతోంది’ అని అన్నారు.

నిర్మాతలు అనవసర ఖర్చులు తగ్గించాలి….

విలక్షణ నటుడు డా. మోహన్ బాబు మాట్లాడుతూ…‘‘బిడ్డను పొగడొద్దని శాస్త్రం చెబుతుంది. అయితే నా బిడ్డను నమ్మిన నిర్మాతలను అభినందిస్తున్నా. ఎందుకంటే నేను ట్రైలర్ చూశాను. అద్భుతంగా నచ్చింది. కానీ నిర్మాత ఎప్పుడూ సెట్స్ కు రావాలి. ఖచ్చితంగా బడ్జెట్ గురించి తెలుసుకోవాలి. లెక్కలు వేసుకోవాలి. సినిమాకు ఎంత ఖర్చవుతుందో అర్థం చేసుకోవాలి. అనవసర ఖర్చును తగ్గించాలి. అప్పుడే మంచి నిర్మాతలుగా ఎదుగుతారు. జయాపజయాలు పక్కన బెడితే, మోహన్ బాబు ఫ్యామిలీ ఎప్పుడూ మోసం చేయదు. ఆ మంచితనం వందేళ్లూ ఉంటుంది. నాకు దర్శకుడంటే బాగా ఇష్టం. అతను లేకపోతే సినమాయే లేదు. ఈ మొదటి సినిమా నీకు గొప్ప విజయం సాధించాలి విజయ్. శ్రీకాంత్ కొన్ని ఫ్రేమ్స్ లో నువ్వు అద్భుతంగా ఉన్నావు. కానీ ఎప్పుడు ఏది చేయాలో భగవంతుడు ముందే నిర్ణయించి ఉంచుతాడు. నాకూ మంచి అవకాశం రావడానికి యేళ్లు పట్టింది. సినిమాలో నటించిన ఆర్టిస్టులకు, సాంకేతిక నిపుణులకు ఆల్ ది బెస్ట్. దర్శక నిర్మాతలకు, నటీనటులకు, ప్రత్యేక ఆహ్వానితులందరికీ ఆశిస్సులు అందిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.

నటీనటులు : మంచు లక్ష్మి, సమ్రాట్ రెడ్డి, ప్రియదర్శి, శ్రీకాంత్ అయ్యంగార్, ఆదర్శ్ బాలకృష్ణ తదితరులు.

సాంకేతిక నిపుణులు : విజువల్ ఎఫెక్ట్స్ : ఉదయ్ కిరణ్. పి, కాస్ట్యూమ్స్ : అజబ్అలీ అక్బర్, ఎడిటర్ : తమ్మిరాజు, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : సామల భార్గవ్, సంగీతం : రఘు దీక్షిత్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : వంశీ కృష్ణనాయుడు, మాటలు : సందీప్ రెడ్డి గంటా, ప్రొడక్షన్ డిజైనర్ : దీప్, సహ నిర్మాత : వివేక్ కూచిభొట్ల, నిర్మాణం : పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, మంచు ఎంటర్టైన్మెంట్స్, నిర్మాతలు : టి.జి. విశ్వప్రసాద్, లక్ష్మి మంచు, రచన, దర్శకత్వం : విజయ్ యెలకంటి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*