యాత్రలో వై.ఎస్.రాజారెడ్డి పాత్రలో ఈయనే

yatra film updates

ప్రస్తుతం టాలీవుడ్ లో బయోపిక్స్ హవా నడుస్తుంది. మహానటి వచ్చి బయోపిక్స్ కి నాంది వేసింది. అయితే రాజకీయ నేతల బయోపిక్ అనగానే జనాల్లో ఒకరకమైన నిరాసక్తత ఉంటుంది. ఇటువంటి బయోపిక్స్ అంటే చాలా వరకు భజన టైపులోనే ఉంటాయి అనే ఆలోచన ఉంటుంది. కానీ ఇక్కడ దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ గురించి ఆలా ఏమీ లేదు. ‘ఆనందో బ్రహ్మ’ సినిమాతో పరిచయం అయిన మహి.వి.రాఘవ్ ఈ చిత్రానికి దర్శకుడు అన్నాక జనాల్లో సీరియస్ నెస్ వచ్చింది. ఇందులో మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి వైఎస్ పాత్ర చేస్తున్నాడన్నాక జనాల్లో ఒక్కసారిగా ఈ చిత్రంపై ఆసక్తి పెరిగింది. అలానే ఇందులో కొంతమంది నటీనటుల పేరులు వింటే మరింత ఆసక్తి పెరుగుతుంది.

మంచిచెడూ చూపిస్తారా..?

ఈ బయోపిక్ లో మమ్ముట్టి తో పాటు రావు రమేష్, పోసాని కృష్ణ మురళి..ఇటీవల రంగస్థలం సినిమాతో ఒక ఊపు ఊపిన అనసూయ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఇక్కడ ఓ ఇంట్రెస్టింగ్ పాత్ర కోసం ఓ ఇంట్రెస్టింగ్ నటుడిని ఈ టీం ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. అయన ఎవరో కాదు.. జగపతిబాబు. వైఎస్సార్ తండ్రి రాజారెడ్డి పాత్రలో జగపతిబాబు కనిపించబోతున్నాడట. అయన ఓ ఫ్యాక్షనిస్టుగానే అందరికీ తెలుసు. అయితే ఇందులో ఆయనలో మంచి చెడులు అన్నీ చూపించనున్నారు. మమ్ముట్టి వైఎస్ పాత్రలో నటిస్తుంటే.. జగపతిబాబు ఆయన కన్నా పెద్ద వయసు పాత్రలో అంటే రాజారెడ్డి పాత్రలో నటించడం విశేషం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*