యాత్రకు ప్రభాస్ అండ..?

yatra film updates

వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘యాత్ర’. ‘ఆనందో బ్రహ్మ’ సినిమా తీసిన మహి వి రాఘవ్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. రాజశేఖర్ రెడ్డి పాత్రలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కొద్ది రోజుల క్రితమే హైదరాబాద్ లో స్టార్ట్ అయింది.

సింగిల్ షెడ్యూల్ లో…

షూటింగ్ లో మమ్ముట్టి పాల్గొంటున్నారు. ఇక ఈ సినిమా నిర్మాతల్లో ఒక్కరైన విజయ్ చిల్లాకు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ మంచి స్నేహితుడు. అందుకే ప్రభాస్ ఈ సినిమా ప్రొమోషన్స్ లో తన వంతు సాయం చేస్తాడని మాటిచ్చాడంట. సినిమా మొత్తం సింగల్ షెడ్యూల్ లో ముగించనున్నారు. దాదాపు సెప్టెంబర్ వరకు ఈ సినిమా షూటింగ్ జరగనుంది. వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి తన రాజకీయ ప్రవేశం నుండి సీఎం అయ్యి చేపట్టిన అన్ని అంశాలు ఇందులో చూపించనున్నారు. అంతే కాకుండా వైఎస్ 2003లో చేపట్టిన పాదయాత్ర హైలైట్ గా చూపించనున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ ఇంకా కంఫర్మ్ చేయలేదు.

Sandeep
About Sandeep 6176 Articles
Sandeep Reddy started his work in journalism at the age of 19 as a local reporter in leading telugu news paper. Later he worked as staff reporter. He has 9 years of experience in print and social media.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*