సంక్రాంతికి షిఫ్ట్ అవుతున్న యాత్ర?

మమ్ముట్టి ప్రధాన పాత్రలో మహి వి రాఘవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘యాత్ర’. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత ఆధారంగా రూపొందిన ఈచిత్రం రీసెంట్ గా షూటింగ్ కంప్లీట్ చేసుకుని రిలీజ్ కు రెడీ గా ఉంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ కాబట్టి ఈసినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈసినిమా రిలీజ్ పై అనుమానాలు చెలరేగుతున్నాయి.

మొదటి నుండి ఈసినిమాను సంక్రాంతికి రిలీజ్ చేస్తాం అని ప్రకటిస్తూనే ఉన్నారు మేకర్స్. కానీ మధ్యలో మనసు మార్చుకుని సినిమాను డిసెంబర్ 21కి ప్రీ-పోన్ చేశారు. ఎందకంటే ఆ రోజు వైఎస్ జగన్ పుట్టినరోజు కాబట్టి ఆ రోజు ఈసినిమాను విడుదల చేస్తే బాగుంటదని ఆలోచన. కానీ ఇప్పుడు మరోసారి యూనిట్ ఆలోచనలో మళ్లీ మార్పు వచ్చింది.

కొంచం కష్టం అయినా పోటీ ఎక్కువగా ఉన్నప్పటికీ సంక్రాంతికే యాత్ర సినిమాను తీసుకురావాలని అనుకుంటున్నారట. సంక్రాంతికి ఆల్రెడీ రెండు మూడు పెద్ద సినిమాలు రెడీ గా ఉన్నాయి. ‘ఎన్టీఆర్’ బయోపిక్…’వినయ విధేయ రామ’…వెంకీ-వరుణ్ నటిస్తున్న ‘ఎఫ్-2 ‘ ఉండనే ఉన్నాయి. మరి ఇంత గట్టి పోటీలో ‘యాత్ర’ సినిమాను రిలీజ్ చేస్తే జనాలు చూస్తారా అన్న అనుమానాలు వస్తున్నాయి. సో ఏం అవుతుందో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*