ఎన్టీఆర్ బయోపిక్ ‘కథానాయకుడు’ షార్ట్ రివ్యూ

teja ntr biopic direction

ఎన్టీఆర్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. మహానాయకుడు, నట సార్వభౌమ నందమూరి తారకరామా రావు జీవిత చరిత్ర ఎన్టీఆర్ బయోపిక్ లో మొదటి భాగం అనగా కథానాయకుడు నేడు వరల్డ్ వైడ్ గా ప్రెక్షకుల ముందుకు వచ్చింది. ఎన్టీఆర్ నట జీవితాన్ని పరిపూర్ణంగా ఆవిష్కరిస్తున్న ఈ ఎన్టీఆర్ బయోపిక్ ని గౌతమీపుత్ర శాతకర్ణి, కంచె, కృష్ణం వందే జగద్గురుమ్ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి… బాలకృష్ణ స్థాపించిన ఎన్ బి కె ఫిలిమ్స్ పై తెరకెక్కించాడు. మరి నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను అలరించడానికి సిద్దమైన కథానాయకుడు హడావిడి ఓవర్సీస్ లో గత అర్ధరాత్రే హడావిడి స్టార్ట్ అయ్యింది. ఓవర్సీస్ లో ఇప్పటికే కథానాయకుడు ప్రీమియర్స్ పూర్తి చేసుకుంది.

NTR Biopic telugu post telugu news

ఇక కథానాయకుడు మొదటినుండి చెబుతున్నట్టుగానే ఎన్టీఆర్ నట జీవితాన్ని క్రిష్ ఎంతో అందంగా తెరకెక్కించాడని అంటున్నారు. ఎన్టీఆర్ ప్రభుత్వ ఉద్యోగిగా సినిమాల్లోకి అడుగుపెట్టినప్పటినుండి.. భార్య బసవతారకంతో అనుబంధం.. అలాగే నట జీవితంలో ఏఎన్నార్ తో అనుబంధాన్ని ఎక్కువగా హైలెట్ చేశారంటున్నారు. ఇక సినిమాకి తండ్రి పాత్ర పోషించిన బాలకృష్ణ నటన అద్భుతం అంటున్నారు. అలాగే విద్య బాలన్ కేరెక్టర్ కూడా హైలెట్ గా ఉండడమే కాదు.. ఎన్టీఆర్, ఏఎన్నార్ మధ్యన వున్నా సన్న్నివేశాలు బావున్నాయట. కాకపోతే సినిమా కాస్త నిడివి ఎక్కువగా ఉండడం… కొన్ని సీన్స్ మరీ సాగదీతగా అనిపిస్తున్నాయని అంటున్నారు. అలాగే ఎమోషనల్ సీన్స్ లో కనెక్టవిటీ మిస్ అయ్యిందనే భావనను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇది ఓవర్సీస్ ప్రేక్షకుడు ఇచ్చిన తీర్పు. మరి ఇక్కడ కూడా అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్టీఆర్ కథానాయకుడు ప్రీమియర్స్ స్పెషల్ షోస్ స్టార్ట్ అయ్యాయి. అలాగే థియేటర్స్ దగ్గర నందమూరి అభిమానులు కోలాహలం ఒక రేంజ్ లో కనబడుతుంది

ntr biopic review

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*