సాక్ష్యం మూవీ రివ్యూ

బ్యానర్: అభిషేక్ పిక్చర్స్
నటీనటులు: బెల్లంకొండ శ్రీనివాస్, పూజ హెగ్డే, జగపతి బాబు, మీనా, శరత్ కుమార్, అశుతోష్ రానా, రవి కిషన్, వెన్నెల కిషోర్, కృష్ణ భగవాన్, రావు రమేష్, పవిత్ర లోకేష్ తదితరులు.
సినిమాటోగ్రఫీ: ఆర్థర్ ఏ. విల్సన్
మ్యూజిక్ డైరెక్టర్: హర్షవర్ధన్ రామేశ్వర్
ఎడిటింగ్: కే. వెంకటేశ్వర రావు
నిర్మాతలు: వివేక్ కూచిభొట్ల, అభిషేక్ నామ
దర్శకత్వం: శ్రీవాస్

టాలీవుడ్ బడా నిర్మాత బెల్లంకొండ సురేష్ కొడుకు బెల్లంకొండ శ్రీనివాస్.. హీరోగా చేసినవి నాలుగు సినిమాలే. నాలుగు సినిమా లు భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలే. బడా నిర్మాత కొడుకు హీరోగా సినిమాలు చెయ్యడం అంటే ఇలా ఉంటుంది అని బెల్లంకొండ శ్రీనివాస్ చూపిస్తున్నాడు. సినిమ సినిమా కి బడ్జెట్ ని పెంచుకోడమే కాదు… సినిమాలకు మరింత క్రేజ్ తెచ్చేందుకు టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ తోనే బెల్లంకొండ రొమాన్స్ చేస్తూ వస్తున్నాడు. హీరోయిన్స్ తో అయినా తనకి మరింత క్రేజ్ వస్తుంది ఆ తండ్రి కొడుకుల ఆలోచన. మరి కమర్షియల్ హీరోగా బెల్లంకొండ నిలదొక్కుకోవాలని ప్రయత్నాలు బాగా చేస్తున్నాడు. అల్లుడు శీను, స్పీడున్నోడు, జయ జానకి నాయక.. ఈ మూడు సినిమాలతో బెల్లంకొండ హీరోగా నిలదొక్కుకున్నాడు కానీ… స్టార్ హీరోగా ఎదగలేకపోయాడు. ఇక తాజాగా భారీ బడ్జెట్ తో శ్రీవాస్ దర్శకతంలో టాలీవుడ్ టాప్ హీరోయిన్ రేస్ కి దగ్గరలో ఉన్న పూజ హెగ్డే హీరోయిన్ పంచభూతాల సాక్షిగా సాక్ష్యం సినిమాలో నటించాడు. పంచభూతాల సాక్షిగా అంటూ… గ్రాఫిక్స్ తో బెల్లంకొండ శ్రీనివాస్ ఈ సినిమాలో తన సిక్స్ ప్యాక్ బాడీతో అలరిస్తున్నాడు. అయితే బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా డ్రెస్సింగ్ స్టయిల్ లో, హుందాతనంతో బాగున్నప్పటికీ.. డైలాగ్ డెలివరీలో తేలిపోయాడని అంటారు. భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ సినిమాలో పూజ హెగ్డే అందాలు ప్రధాన ఆకర్షణ అన్నట్టుగా ట్రైలర్, పాటలు చూస్తుంటేనే తెలుస్తుంది. మరి హీరోయిన్ గా ఒకప్పుడు స్టార్ హీరోలతో నటించిన మీనా ఈ సినిమా లో బెల్లకొండకి తల్లి పాత్ర చెయ్యడం కూడా ఈ సినిమాపై ఆసక్తిని కలిగించే అంశాల్లో ఒకటి. భారీ అంచనాల నడుమ ఈ రోజు శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సాక్ష్యం సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో అనేది సమీక్షలో తెలుసుకుందాం.

కథ:

పేదలకు సహాయపడుతూ.. అందరిని తన వాళ్లలా భావించే రాజు(శరత్ కుమార్)ని, అతని కుటుంబాన్ని మునుస్వామి(జగపతి బాబు) తన తమ్ముళ్లతో కలిసి చంపేస్తాడు. అయితే ప్రత్యర్థుల చేతిలో తల్లితండ్రులను పోగొట్టుకున్న విశ్వజ్ఞ (బెల్లంకొండ శ్రీనివాస్) శివ ప్రసాద్ కి దొరుకుతాడు. పిల్లలు లేని శివ ప్రసాద్ విశ్వజ్ఞని కన్న కొడుకులా పెంచుకుంటాడు. అయితే విదేశాల్లో ఉండే విశ్వజ్ఞ.. వీడియో గేమ్ డెవలపర్ గా ఉంటూ… అక్కడ ఆధ్యాత్మికతకు ప్రాణం పెట్టె ఐశ్వర్య (పూజ హెగ్డే) అనే అమ్మాయి ప్రేమలో పడతాడు. అయితే ఐశ్వర్య మాత్రం విశ్వజ్ఞ ప్రేమను అస్సలు నమ్మదు. అనుకోకుండా ఐశ్వర్య ఇండియాకి వచ్చేస్తుంది. అయితే ఐశ్వర్యని ఎతుక్కుంటూ విశ్వజ్ఞ కూడా ఇండియాకి వస్తాడు. ఇండియాలో తనకు తెలియకుండానే… తన తల్లి తండ్రులను చంపిన మునుస్వామిని ఎదురిస్తుంటాడు విశ్వజ్ఞ. అందులో భాగంగానే మునుస్వామి తమ్ముళ్లు విశ్వజ్ఞ చేతిలో హతమవుతుంటారు. మరి చివరికి మునుస్వామిని కూడా విశ్వజ్ఞ చంపేశాడా? అసలు మునుస్వామి తన తల్లిదండ్రులను చంపాడని విశ్వజ్ఞకు తెలుస్తుందా? అసలు ఐశ్వర్య ఎవరు? ఐశ్వర్యకి మునుస్వామికి ఉన్న సంబంధం ఏమిటి? అనే డౌట్స్ అన్ని క్లియర్ కావాలంటే సాక్ష్యం సినిమాని చూడాల్సిందే.

నటీనటుల నటన:

విశ్వజ్ఞ గా బెల్లంకొండ శ్రీనివాస్ బాగా మెప్పించాడు. బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, నటనలో కానివ్వండి బెల్లకొండ శ్రీనివాస్ మునుపుటి మీద మెరుగ్గా ఈ సినిమా లో కనిపించాడు. ఇక సిక్స్ ప్యాక్ బాడీతో బెల్లంకొండ అదరగొట్టాడనే చెప్పాలి. గత సినిమాల కన్నా ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ నటనలో పరిణతి కనబడుతుంది. నటనలో మంచి మెళుకువలు నేర్చుకున్నాడు అనిపిస్తుంది. కాకపోతే డైలాగ్ డెలివరీలోనే కాస్త వీక్ గా కనిపించాడు బెల్లంకొండ. ఇక యాక్షన్ ఎపిసోడ్ లో, డాన్స్ ల పరంగా బెల్లంకొండ ఎప్పటిలాగే ఎనర్జిటిక్ నటనతో ఆకట్టుకున్నాడు. ఇక హీరోయిన్ పూజ హెగ్డే మొదటి నుండి చెప్పినట్టుగానే ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అందమైన ట్రెడిషనల్ డ్రెస్సులతో, గ్లామర్ గా పూజ హెగ్డే ఈ సినిమా కే హైలెట్ అని చెప్పొచ్చు. ఇక బెల్లంకొండతో పాటుగా పాటల్లోనూ అదరగొట్టే స్టెప్స్ తో మెప్పించింది పూజ. గ్లామర్ కి గ్లామర్, నటనకు నటన.. అన్నిటిలో బాగా చేసింది. ఇక మీనా కనిపించింది కొద్దిసేపే అయినా… ఆమె నటన బాగుంది. ఇక శరత్ కుమార్ బెల్లంకొండ తండ్రిగా, పేదల పాలిట పెన్నిధిగా మెప్పించాడు. జగపతి బాబు మునుస్వామి పాత్రలో విలనిజాన్ని ఎప్పటిలాగే పండించాడు. రవికిషన్, అశుతోష్ రానాలు విలన్స్ గా జస్ట్ ఓకె ఓకె పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు. ఇక వెన్నెల కిషోర్ కామెడీ అంతగా వర్కౌట్ అవ్వలేదనిపిస్తుంది. పవిత్ర లోకేష్ – జయ ప్రకాష్ లు బెల్లంకొండ పెంపుడు తల్లిదండ్రులుగా మెప్పించారు. మిగతా నటీనటులు తమ పరిధి మేర ఆకట్టుకున్నారు.

విశ్లేషణ:

దర్శకుడు శ్రీవాస్ కొత్త కథని తీసుకున్నాడు. ఈ భూమ్మీద తప్పుచేసిన ప్రతి ఒక్కరు నాలుగు దిక్కులు వెతికి.. ఎవ్వరూ చూడలేదని అనుకుంటారని, కానీ పైనుంచి ఐదవ దిక్కు మనల్ని ఎప్పుడూ చూస్తూనే ఉంటుందని, దాని నుంచి తప్పించుకోవడం ఎవరి తరం కాదనే కాన్సెప్ట్‌ తో శ్రీవాస్ ఈ సాక్ష్యం చిత్రాన్ని తెరకెక్కించాడు. అయితే శ్రీవాస్ మంచి కాన్సెప్ట్ తోనే సినిమా చేసాడు. కానీ కథనంలో తడబడ్డాడు. స్క్రీన్ ప్లే మరి వీక్ గా అనిపిస్తుంది. బెల్లంకొండ శ్రీనివాస్ ని తనకు నచ్చిన యాంగిల్ లోనే స్క్రీన్ మీద ప్రెజెంట్ చేసాడు. మంచి కథను ఎన్నుకున్నప్పుడు కథనాన్ని అంతే రాసవత్తరంగా సాగించినట్లయితే సినిమా ఒక రేంజ్ హిట్ అయ్యుండేది. బెల్లంకొండని వీడియో గేమ్ డెవెలపర్ గా రిచ్ గా చూపించాడు. పంచభూతాలతో మిళితమైన చావులను తెలివిగానే… కానీ లాజిక్ లేకుండా ప్రెజెంట్ చేసాడు. వాటిని చూస్తుంటే కాస్త నాటకీయ పరిణామాల వలె అనిపిస్తాయి. కాకపోతే హీరో హీరోయిన్స్ రొమాంటిక్ పార్ట్ మాత్రం అంతగా లేదనే చెప్పాలి. అలాగే కామెడీని కూడా దర్శకుడు బాగా లైట్ తీసుకున్నాడు. ఈ సినిమాని శ్రీవాస్ పక్కా యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు ఫాంటసీ థ్రిల్లర్‌ను జోడించి మరీ తెరకెక్కించాడు. శ్రీవాస్ ఈ సినిమా కోసం భారీ తరగణాన్ని ఎన్నుకున్నాడు కానీ… వారిని వాడుకోవడంలో పూర్తిగా విఫలమయ్యాడు. ఈ సినిమా లో విలన్స్ గా చేసిన జగపతి బాబు తప్పితే మిగతా వారందరూ తేలిపోయారు. ఇక అభిషేక్ పిక్చర్స్ వారు పెట్టిన పెట్టుబడి ప్రతి సీన్ ని హైలెట్ చేసింది.

సాంకేతిక వర్గం పనితీరు:

హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ ఈ సినిమాకి ఏమంత గొప్పగా అనిపించలేదు. కాకపోతే పాటలను సినిమాలో వచ్చే రిచ్ బ్యాగ్రౌండ్ తో వింటే ఓకె అనిపిస్తాయి. కానీ మ్యూజిక్ సో సో గా ఉన్నప్పటికీ నేపధ్య సంగీతం అదరగొట్టింది. యాక్షన్, ఎమోషనల్ సీన్స్ లో బ్యాగ్రౌండ్ స్కోర్ మరోస్థాయికి తీసుకెళ్లింది. విల్సన్ సినిమాటోగ్రఫీ కూడా సినిమాకి మెయిన్ హైలెట్ గా నిలిచింది. ప్రతి సీన్ ని అందంగా చూపెట్టాడు. అలాగే దుబాయ్ లొకేషన్స్ ని, వారణాసి ఎపిసోడ్ లో కూడా కెమెరా వర్క్ బావుంది. ఇక ఎడిటింగ్ విషయానికొస్తే.. చాలా వీక్ గా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో బాగా సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. చాలా చోట్ల కత్తెర వేయాల్సిన సీన్స్ ని అలానే ఉంచేయడం స్లో నేరేషన్ ఫిలింగ్ తెప్పిస్తుంది. ఇక ఈ సినిమాకి మెయిన్ హైలెట్ మాత్రం నిర్మాణ విలువలు. ప్రతి సన్నివేశంలో ను నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్: కథ, బెల్లంకొండ నటన, కాన్సెప్ట్, పూజ హెగ్డే నటన, గ్లామర్, బ్యాగ్రౌండ్ స్కోర్, నిర్మాణ విలువలు, సినిమాటోగ్రఫీ

మైనస్ పాంట్స్: కథనం, ఫస్ట్ హాఫ్, డైరెక్షన్, మ్యూజిక్, ఎడిటింగ్, పాటలు, లాజిక్ లేని సీన్స్, కామెడీ లేకపోవడం

రేటింగ్: 2.5 /5

Sandeep
About Sandeep 6914 Articles
Sandeep Reddy started his work in journalism at the age of 19 as a local reporter in leading telugu news paper. Later he worked as staff reporter. He has 9 years of experience in print and social media.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*