సుబ్రహ్మణ్యపురం మూవీ రివ్యూ

subrahmanyapuram movie review collections telugu news

నటీనటులు: సుమంత్, ఈషా రెబ్బ, సాయికుమార్, సురేష్, జోష్ రవి తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్: శేఖర్ చంద్ర
సినిమాటోగ్రఫీ: ఆర్,కె.ప్రతాప్
నిర్మాత: బీరం సుధాకర రెడ్డి
దర్శకత్వం : సంతోష్ జాగర్లపూడి

అక్కినేని హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సుమంత్ అక్కినేని నాగేశ్వర రావు, నాగార్జున ల స్టార్ డం ని మాత్రం సొంతం చేసుకోలేకపోయాడు. కెరీర్ తొలినాళ్లలో కాస్త మంచి కథలను ఎంచుకున్న సుమంత్.. తర్వాత హిట్ అనే పదానికే దూరమయ్యాడు. ఏళ్లు గడిచినా హీరోగానే కొనసాగుతున్న సుమంత్ గత ఏడాది మళ్ళీరావా సినిమాతో గాడిన పడ్డాడు. గౌతమ్ తిన్నసూరి దర్శకత్వంలో సుమంత్ నటించిన మళ్ళీరావాతో రొమాంటిక్ హిట్ అందుకున్నాడు. మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కిన సుమంత్ తాజాగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో సుబ్రమణ్యపురం అనే సస్పెన్స్ థ్రిల్లర్ లో నటించాడు. తెలుగమ్మాయి.. ఈషా రెబ్బ నటించిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సక్సెస్ ట్రాక్ ఎక్కడానికి నానా కష్టాలు పడిన సుమంత్ ఈ సుబ్రమణ్యపురంతో ఎలాంటి ఫలితాన్ని చవి చూశాడో అనేది సమీక్షలో తెలుసుకుందాం.

కథ :

మొదటి నుంచే నాస్తికుడైన కార్తీక్( సుమంత్) దేవాలయాలలో పరిశోధకునిగా పని చేస్తుంటాడు. అదే సమయంలో ప్రియా(ఈషా)తో ప్రేమలో పడడమే కాదు… ఆమెను ప్రేమించమని ఆట పట్టిస్తుంటాడు. ఆ సమయంలోనే తాను ప్రేమించిన ప్రియా వాళ్ల సుబ్రహ్మణ్యపురం అనే గ్రామంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహానికి అభిషేకం చేయరాదన్న నియమం ఒకటుంటుంది. ఆ నియమాన్ని తప్పి ఒక వ్యక్తి విగ్రహానికి అభిషేకం చేసి గుడిలోనే ఆత్మహత్య చేసుకుంటాడు. ఆ తర్వాత అతని లాగే చాలామంది విచిత్రంగా ఆత్మహత్యలు చేసుకుంటారు. ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శాపమే అని… స్వామి వారు గ్రామస్తులను శపించాడని వదంతులు పుడతాయి. దానితో భయపడిన గ్రామస్తులు ఊరిని ఖాళీ చేసి వెళ్లిపోవాలనుకుంటారు. గ్రామస్తులను ఎలా ఆపాలో తెలియక గ్రామ పెద్ద(సురేష్) సతమతమవుతుంటాడు. అయితే ఆ గుడి వెనుక ఉన్న రహస్యం ఛేదించడానికి సుమంత్ ఆ ఊరికి వస్తాడు. మరి ఆ గుడి రహస్యాన్ని సుమంత్ ఛేదించాడా? అసలు నిజంగానే స్వామి వారు గ్రామస్తులను శపించాడా? అసలు సుమంత్ కి ఆ గుడి రహస్యాన్ని చేదించేటప్పుడు ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది? అనేది తెరమీద చూడాల్సిందే.

నటీనటుల నటన:

నాస్తికుడిగా సుమంత్ నటన బాగుంది. దేవాలయాల పరిశోధకుడిగా కార్తీక్ పాత్రలో సుమంత్ బాగున్నాడు. కాకపోతే సుమంత్ మోహంలో తన వయస్సు మాత్రం స్పష్టంగా కనబడుతుంది. అలాగే ఈషా రెబ్బాకు, సుమంత్ కు మధ్య లవ్ ట్రాక్ అంతగా పండలేదు అనిపిస్తుంది. కాకపోతే గుడి రహస్యాన్ని ఛేదించే సన్నివేశాల్లో సుమంత్ నటన చాల బాగుంది. ఇక హీరోయిన్ ఈషా రెబ్బ పెద్దగా స్కోప్ లేని పాత్రలో నటించగా.. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. సుమంత్ తో రొమాంటిక్ సన్నివేశాల్లో తేలిపోయింది. ఇక గ్రామ పెద్దగా సురేష్, కాస్త పవర్ ఫుల్ పాత్రలో సాయికుమార్ మేప్పించారు. ఇక గిరిధర్, జోష్ రవి మిగతా నటులు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.

విశ్లేషణ :

దర్శకుడు ఈ చిత్రాన్ని గతంలో నిఖిల్, స్వాతి జంటగా తెరకెక్కిన కార్తికేయ చిత్రాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి రాసుకున్నట్టుగా.. ప్రతి సన్నివేశంలోనూ అనిపిస్తుంది. ఎందుకంటే కార్తికేయ కు, ఈ సుబ్రమణ్యపురం కథకు చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. కార్తికేయ చిత్రంలో గుడిలోని వజ్రాన్ని సొంతం చేసుకోవడానికి.. పాముతో హత్యలు చేయిస్తే… ఈ సినిమాలో ఆత్మహత్యలు చేసుకునేలా ప్రోత్సహిస్తారు. కాకపోతే కార్తికేయ చిత్రం చూడని వారికి దర్శకుడు సంతోష్ జాగర్లపూడి ఎంచుకున్న సుబ్రమణ్యపురం కథ కొత్తగా అనిపిస్తుంది. కథలో పస ఉన్నప్పటికీ… కథనం ఇంకా ఆసక్తికరంగా నడపొచ్చు. కానీ దర్శకుడు కథనం విషయంలో తడబడ్డాడు. ఫస్టాఫ్ అంతా థ్రిల్లింగ్ గా మలచాలనుకున్న డైరెక్టర్.. కథను సాగదీయడంతో.. అప్పుడే ఈ మూవీ ట్రాక్ తెలిసిపోతుంది. సాఫీగా సాగుతున్న ఫస్టాఫ్ లో కొన్ని ఊహించని సంఘటనల ద్వారా సెకండాఫ్ మీద మరింత ఆసక్తిని కనబరుస్తాయి. సెకండాఫ్ లో కథనాన్ని బాగానే నడిపించాడనుకున్నా…. కొన్నిసన్నివేశాలు రక్తి కట్టించ లేకపోయాయి. కథ బాగానే ఉన్నా సరే ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త ఎక్కువ శ్రద్ధ తీసుకొని ఉంటే బాగుండును.

సాంకేతిక వర్గం పనితీరు

ఇక మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర మ్యూజిక్ సో సో గానే ఉన్నప్పటికీ నేపధ్య సంగీతంతోనే సినిమాని నిలబెట్టాడు. గుడిలో వచ్చే సన్నివేశాలకు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ వెన్నెముఖలా అనిపిస్తుంది. అలాగే సినిమాటోగ్రఫీ కూడా పర్వాలేదనిపిస్తుంది. ఇక ఎడిటింగ్ మాత్రం చెత్తగా ఉంది. చాలా కత్తెర్లు వేయాల్సిన సీన్స్ ని అలానే ఉంచేశారు. ఇక ఈ సినిమాకి నిర్మాణ విలువలు మైనస్ గా అనిపిస్తాయి.

ప్లస్ పాయింట్స్ : సుమంత్ నటన, ఫస్ట్ హాఫ్, ట్విస్టులు, బ్యాగ్రౌండ్ మ్యూజిక్

మైనస్ పాయింట్స్ : నిర్మాణ విలువలు, ఎడిటింగ్, మ్యూజిక్, రొటీన్ కథ

రేటింగ్: 2.5/5

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*