కార్తీ…కి ఈసారైనా బెర్త్ దొరికేనా….??

18/04/2019,11:59 సా.

తమిళనాడులోని శివగంగ లో ఆసక్తికరమైన పోరు జరుగుతోంది. కాంగ్రెస్ అభ్యర్థిగా కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం, అన్నాడీఎంకే అభ్యర్థిగా హెచ్.రాజా బరిలో ఉన్నారు. 1967 లో ఆవిర్భవించిన ఈ నియోజకవర్గం పేరు చెప్పగానే ముందుగా చిదంబరం గుర్తుకు వస్తారు. ఏడుసార్లు ఆయన ఇక్కడి [more]

తొలిసారి…కనిమొళి…..??

18/04/2019,11:00 సా.

కనిమొళి…. పరిచయం అక్కరలేని పేరు. జాతీయ , తమిళ రాజకీయాల్లో ఈ యువ రాజకీయ వేత్త పేరు అందరికీ సుపరిచితం. 2జీ కేసులో నిందితురాలిగా జైలు శిక్ష అనుభవించిన కనిమొళి చిన్న వయసులోనే రాజకీయాల్లో ఎన్నో ఎత్తుపల్లాలను చూశారు. దివంగత డీఎంకే అధినేత కరుణానిధి గారాలపట్టి అయిన కనిమొళి [more]

పళని పని అయిపోయినట్లేనా…?

13/04/2019,11:59 సా.

తమిళనాడులో లోక్ సభ ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారనుందా? లోక్ సభ ఎన్నికలతో పాటు ఉప ఎన్నికలు జరుగుతుండటంతో ఈ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర ప్రభుత్వ మనుగడను శాసిస్తాయని చెప్పనవసరం లేదు. తమిళనాడులో ప్రస్తుతమున్న అధికార పార్టీ మ్యాజిక్ ఫిగర్ కు చేరువలోనే ఉంది. 111 మంది ఎమ్మెల్యేల [more]

దినకరన్ వెంట ఉంటే ఇక అంతేనా…??

05/03/2019,10:00 సా.

తమిళనాడులో దినకరన్ కు కష్టాలు మొదలయ్యయనే చెప్పాలి. మేనత్త శశికళ జైలు నుంచి ఇస్తున్న సూచనలు అమలు చేయడమే దినకరన్ పని. అయితే క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం అవుతుందనుకుంటే తాజా పరిణామాలతో అది కష్టసాధ్యమేనంటున్నారు. ఎందుకంటే తమిళనాడులో గుర్తు బలంగా పనిచేస్తుంది. నిన్న మొన్నటి వరకూ రెండాకుల గుర్తు [more]

ఈ భాషా చూడు… భాషా చూడు….!!!

01/03/2019,11:59 సా.

సూపర్ స్టార్ రజనీకాంత్… లోక్ సభ ఎన్నికల వేళ రజనీకాంత్ ఎవరి వైపు మొగ్గు చూపుతారు? తటస్థంగా ఉంటారా? లేక ఏదో ఒక పార్టీకి స్నేహ హస్తం అందిస్తారా? అన్నది ఇప్పుడు తమిళనాట చర్చనీయాంశంగా మారింది. రజనీకాంత్ తమిళనాడులో కొత్త పార్టీ పెట్టనున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పటి వరకూ [more]

ఎవరికి దెబ్బేస్తారో కదా…??

26/02/2019,11:59 సా.

తమిళనాట ఎన్నికల సమయంలో కమల్ హాసన్ ఇప్పుడు హాట్ టాపిక్ గామారారు. సూపర్ స్టార్ రజనీకాంత్ పార్టీ ఇప్పటికే ప్రారంభం కాలేదు. ఆయన వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తాము పోటీ చేసేది లేదని చెప్పేశారు. కానీ కమల్ హాసన్ మాత్రం వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ [more]

పొత్తే ప్రమాదంలో పడేసిందా….?

24/02/2019,11:00 సా.

తమిళనాడులో అన్నాడీఎంకేలో అసమ్మతి బయలుదేరుతుందా? లోక్ సభ ఎన్నికల సందర్భంగానే చిచ్చు రాజుకుంటుందా? అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. తమిళనాడులో భారతీయ జనతా పార్టీ, పీఎంకేతో పొత్తు పెట్టుకుని అన్నాడీఎంకే ఎన్నికలకు వెళ్లనుంది. డీఎండీకేను కూడా కలుపుకోవాలని చూస్తోంది. దీంతో అన్నాడీఎంకే గత ఎన్నికల కంటే భిన్నంగా తక్కువ [more]

అంతా ఆయన చేతిలోనే….!!!

22/02/2019,11:59 సా.

అన్బుమణి రాందాస్…ఈయన తమిళనాడులో బలమైన నేత. పొట్టాలి మక్కల్ కాంచి (పీఎంకే) పార్టీని స్థాపించారు. వన్నియార్ సామాజిక వర్గం ఈ పార్టీకి అండగా ఉంటుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో అన్జుమణి రాందాస్ నేతృత్వంలోని పీఎంకే ఒక్క స్థానాన్ని కూడా దక్కించుకోకపోయినా ఆయనకు పదిలమైన ఓటు బ్యాంకు ఉందనడంలో ఎటువంటి [more]

ఈయన చెప్పిందే వేదమా…??

21/02/2019,11:59 సా.

తమిళనాడు రాష్ట్రంలో ఒక పొత్తు పొడిచింది. భారతీయ జనతా పార్టీ, అన్నాడీఎంకే పొత్తు కుదిరింది. ఇక విపక్ష కూటమి సీట్ల సర్దుబాటు కావాల్సి ఉంది. తమిళనాడు, పుదుచ్చేరితో కలసి మొత్తం 40 పార్లమెంటు స్థానాలుండగా, కూటమిలో చిన్నా చితకా పార్టీలన్నీ కలిపీ దాదాపు ఏడు వరకూ ఉన్నాయి. వీటన్నింటికీ [more]

గేమ్ ఛేంజర్ ఎవరు…?

15/02/2019,11:00 సా.

తమిళనాడులో వింత పరిస్థితి ఉంది. వచ్చే లోక్ సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు కూడా జరగనున్నాయి. దీంతో ప్రధాన పార్టీలు కేవలం పార్లమెంటు ఎన్నికలను మాత్రమే కాకుండా ఉప ఎన్నికలను కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఉప ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో విజయం సాధిస్తే రాష్ట్రంలో [more]

1 2 3