కీలకంగా మారిన చంద్రబాబు ఢిల్లీ పర్యటన

17/05/2019,12:16 సా.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. ఇవాళ ఆయన ఢిల్లీ వెళ్లి సాయంత్రం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్నారు. చంద్రగిరి నియోజకవర్గంలోని ఐదు పోలింగ్ బూత్ లలో రీపోలింగ్ నిర్వహిస్తుండటం పట్ల ఆయన అభ్యంతరం తెలపనున్నారు. అనంతరం ఆయన కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలను కలిసి ఫలితాల అనంతరం [more]

తెలంగాణ కాంగ్రెస్ కు భారీ షాక్..?

09/05/2019,06:39 సా.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరో భారీ షాక్ తగలనుంది. ఆ పార్టీ సంగారెడ్డి ఎమ్మెల్యే, బలమైన నేతగా ఉన్న తూర్పు జయప్రకాశ్ రెడ్డి(జగ్గారెడ్డి) పార్టీని వీడటం ఖాయంగా కనిపిస్తోంది. తనకు కేసీఆర్, ఆయన బంధువుల నుంచి పార్టీలోకి రావాలని ఆహ్వానం అందిందని జగ్గారెడ్డి చెప్పారు. మీడియాతో చిట్ చాట్ [more]

ఓటరు జాబితా లేకుండానే ఎన్నికలేంటి..?

09/05/2019,05:16 సా.

ఓటరు జాబితా కూడా లేకుండానే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయడంపై కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ మేరకు పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ప్రస్తుతం స్థానిక సంస్థల సభ్యుల పదవీకాలం ముగుస్తుందని, మళ్లీ [more]

ఫిరాయింపు ఎమ్మెల్యేపై రాళ్ల దాడి

04/05/2019,12:24 సా.

కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచి పార్టీ ఫిరాయించి అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియా నాయక్ కు చుక్కుదెరైంది. ఇవాళ నియోజకవర్గ పర్యటనలో ఉన్న ఆమెను కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచి పార్టీ మారారని ఆరోపిస్తూ ఆమె కాన్వాయ్ పై రాళ్ల [more]

నేను రెచ్చిపోతే ప్రభుత్వం పడిపోతుంది..!

02/05/2019,05:54 సా.

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల ఇళ్లపై ప్రజలు దాడి చేయాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమాంతరావు పిలుపునిచ్చారు. కేటీఆర్ బావమరిది స్నేహితుడికి ఇంటర్ ఫలితాల టెండర్ ఇచ్చారని, కేటీఆర్ కు బావమరిది మీద ఉన్న మోజుతో 22 మంది విద్యార్థులు బలయ్యారని ఆరోపించారు. తాను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కేటీఆర్ [more]

కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపిన రఘువీరారెడ్డి

30/04/2019,07:47 సా.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాకు మద్దతు తెలిపినందుకు కేసీఆర్ కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్ధిత్వానికి మద్దతు ఇవ్వాలని కేసీఆర్ ను ఆయన కోరారు. రాహుల్ గాంధీ ప్రధాని [more]

అందుకే కేటీఆర్ రావడం లేదు..!

30/04/2019,04:28 సా.

విద్యార్థులకు అన్యాయం చేసిన వారు బాగుపడరని, రెండేళ్లలో ప్రభుత్వం కూలిపోతుందని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు శాపం పెట్టారు. గ్లోబరినా సంస్థతో తనకు సంబంధం లేదని జూబ్లీహిల్స్ పెద్దమ్మగుడిలో ప్రమాణం చేయాలని నిన్న ఆయన కేటీఆర్ కు సవాల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇవాళ ఉదయాన్నే [more]

బ్రేకింగ్: రాహుల్ గాంధీ పౌరసత్వంపై వివాదం

30/04/2019,11:56 ఉద.

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ పౌరసత్వంపై వివాదం కొనసాగుతోంది. ఆయనకు బ్రిటన్ పౌరసత్వం ఉందని బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు. 2003లో యూకేలో నమోదైన ఒక కంపెనీకి సంబంధించిన వివరాల్లో రాహుల్ గాంధీకి బ్రిటన్ పౌరసత్వం ఉందని సుబ్రహ్మణ్యస్వామి పేర్కొన్నారు. [more]

కొండాకు ఎట్టకేలకు ఊరట..!

29/04/2019,03:37 సా.

కాంగ్రెస్ నేత, చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డికి ఎట్టకేలకు ఊరట లభించింది. ఎస్సై, కాన్సిస్టేబుల్ ను నిర్భిందించారనే కేసులో కొండా అరెస్టు తప్పదనుకున్నా చివరకు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరైంది. దీంతో అరెస్టును నుంచి ఆయన బయటపడ్డారు. టీఆర్ఎస్ నుంచి చేవెళ్ల ఎంపీగా గెలిచిన కొండా తాజాగా [more]

ఎక్కడికక్కడ ప్రతిపక్ష పార్టీల నేతలు అరెస్ట్

29/04/2019,12:08 సా.

ఇంటర్ ఫలితాల్లో అవకతవకలను నిరసిస్తూ ‘ఇంటర్ బోర్డు ముట్టడి’కి పిలుపునిచ్చిన తెలంగాణ ప్రతిపక్ష పార్టీల నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. ఫలితాల్లో అవకతవకల కారణంగా విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని, ఫలితాల అవకతవకల వెనుక ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ తో కాంగ్రెస్, టీడీపీ, తెలంగాణ జన [more]

1 2 3 4 5 87