మోడీకి చెక్ పెట్టాలంటే…ఇది జరగాల్సిందేనా?

17/05/2018,11:59 సా.

కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవచ్చు. జనతాదళ్(ఎస్)కు గతంలో కన్నా ఒకటి… రెండు స్థానాలు తగ్గి ఉండవచ్చు. బీజేపీ ఆధిక్యం సాధించి ఉండవచ్చు. కానీ లోతుగా విశ్లేషిస్తే బీజేపీని వ్యతిరేకించే కాంగ్రెస్, ఇతర విపక్షాలకు ఓ స్పష్టమైన సందేశాన్ని ఇచ్చాయి. అదే విపక్షాల ఐక్యత. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ ను [more]

వాజూభాయి సరైనోడు..!

17/05/2018,10:00 సా.

వాజుభాయి వాలా…. నిన్నమొన్నటి దాకా ఈ పేరు ఎవరిదో చాలా మందికి తెలియదు. కర్ణాటక ప్రధమ పౌరుడైన ఆయన గురించి ఆ రాష్ట్రంలోనే చాలామందికి తెలియందంటే ఆశ్చర్యం కలగక మానదు. కానీ ఇప్పుడు ఒక్కసారి దేశవ్యాప్తంగా వాజూభాయి వాలా పేరు మార్మోగుతోంది. జాతీయ మీడియా ఒక్కసారిగా ఆయనపై దృష్టి సారించింది. [more]

సిద్ధూలో ఇంత ఆనందమా? ఎందుకంటే?

17/05/2018,06:00 సా.

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఫుల్లు ఖుషీగా ఉన్నారా? ఆయన లోలోపల ఎంతో సంతోష పడుతున్నారా? అవుననే అంటున్నారు ఆయన సన్నిహితులు. సిద్ధరామయ్య తన సంక్షేమ కార్యక్రమాలతోనే ఈసారి కూడా గట్టెక్కాస్తానని భావించారు. లింగాయత్ లలో కొంతమేరకైనా తనకు మద్దతు లభిస్తే తన విజయం నల్లేరు మీద నడకే [more]

కేసీఆర్‌కు షాక్ ఇచ్చిన ఆ ఇద్ద‌రు

17/05/2018,05:00 సా.

క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ఫ‌లితాలు ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ఏర్పాటుకు ప్ర‌య‌త్నం చేస్తున్న కేసీఆర్‌కు షాక్ ఇచ్చాయి. మొద‌టి నుంచి ఊహించిన‌ట్లుగానే క‌న్న‌డ‌నాట హంగ్ ఏర్ప‌డ‌డం.. బీజేపీ 104 అసెంబ్లీ స్థానాల్లో గెలుపుతో అతిపెద్ద పార్టీగా ఏర్ప‌డినా ప్ర‌భుత్వం ఏర్పాటుకు అవ‌స‌ర‌మైన మ్యాజిక్ ఫిగ‌ర్‌ను అందుకోలేక‌పోయింది. 78 స్థానాల్లో గెలుపుతో కాంగ్రెస్ [more]

బీజేపీ…. కాంగ్రెస్‌నే మించిపోయిందే!

17/05/2018,04:00 సా.

బీజేపీ అధికార దాహం ఎలా ఉందో తెలియ‌జెప్పేందుకు క‌ర్ణాట‌కలో జ‌రుగుతున్న రాజ‌కీయ ప‌రిణామాలే నిద‌ర్శ‌న‌మనే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. అధికారం చేజిక్కించుకునే క్ర‌మంలో గెలుపు ముంగిట వ‌ర‌కూ వ‌చ్చి ఆగిపోయిన ప‌క్షంలో.. ప్రజా తీర్పును పాటించ‌డం హుందాత‌నాన్ని తీసుకొస్తుంది. కానీ ఎలాగైనా అధికారాన్ని హస్త‌గ‌తం చేసుకోవాల‌నే క్ర‌మంలో.. గ‌వ‌ర్న‌ర్‌ను అడ్డుపెట్టుకుని [more]

హైద‌రాబాద్‌ లో క‌న్న‌డ‌ పాలిటిక్స్

17/05/2018,02:00 సా.

అనుక్ష‌ణం ఉత్కంఠ రేపుతున్న క‌ర్ణాట‌క రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో ఎవ‌రికీ అంతుచిక్క‌డం లేదు. మ‌రోవైపు క్యాంపు రాజ‌కీయాలు మొద‌ల‌య్యాయి. త‌మ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా ఉండేందుకు కాంగ్రెస్‌-జేడీఎస్ తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. ఇక గెలుపు ముంగిట నిలిచిపోయినా ఎలాగైనా అధికారం సొంత చేసుకోవాల‌నే ప‌ట్టుద‌ల‌తో క‌మ‌ల‌నాథులు సామ‌దాన‌బేధ‌దండోపాయాల‌న్నీ ప్ర‌యోగిస్తున్నారు. [more]

యడ్డీకి అసలు పరీక్ష ఇదే…!

17/05/2018,01:00 సా.

క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రిగా బీజేపీ శాస‌న స‌భ ప‌క్ష‌నేత య‌డ్యూర‌ప్ప ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. నిన్న య‌డ్యూర‌ప్ప‌ను బీజేపీ శాస‌న స‌భ ప‌క్ష నేత‌గా ఎన్నుకున్న త‌ర్వాత ప్ర‌భుత్వం ఏర్పాటు చేయాల‌ని గ‌వ‌ర్న‌ర్ వాజూభాయ్ వాలా ఆహ్వానం ప‌లికారు. బ‌ల‌నిరూప‌ణ‌కు గ‌వ‌ర్న‌ర్ వాజూభాయ్ వాలా ప‌దిహేను రోజుల గ‌డువు [more]

బ్రేకింగ్ : యడ్డీ ప్రమాణం …….ఒక్కరే…!

17/05/2018,09:33 ఉద.

కర్ణాటక ముఖ్యమంత్రిగా బీఎస్ యడ్యూరప్ప ప్రమాణస్వీకారం చేశారు. కొద్దిసేపటి క్రితం రాజభవన్ లో యడ్యూరప్ప చేత గవర్నర్ వాజూభాయి వాలా ప్రమాణ స్వీకారం చేయించారు. కర్ణాటక రాష్ట్రానికి యడ్యూరప్ప 23వ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే యడ్యూరప్ప బలనిరూపణను పదిహేను రోజుల్లో చేసుకోవాల్సి ఉంది. బలనిరూపణ తర్వాతనే మంత్రివర్గ సభ్యుల [more]

యడ్డీకే అవకాశం…మరికాసేపట్లో ప్రమాణ స్వీకారం

17/05/2018,07:17 ఉద.

కర్ణాటక గవర్నర్ బీజేపీ నేత యడ్యూరప్పకే అవకాశం ఇచ్చారు. బీజేపీనే ఆయన ఆహ్వానించారు. యడ్యూరప్పను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు గవర్నర్ వాజుభాయ్ వాలా అనుమతిచ్చారు. అయితే ఇందుకు బలనిరూపణ కోసం పదిహేను రోజులు గడువు ఇచ్చారు. జేడీఎస్, కాంగ్రెస్ లు గవర్నర్ ను కలిసి తమకు స్పష్టమైన [more]

వీళ్లే కమలాన్నిఅధికారానికి దగ్గరకు చేర్చారా?

16/05/2018,11:59 సా.

మొత్తానికి కర్ణాటక ఎన్నికల్లో బీజీపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగానే అవతరించింది. అధికారం చేపట్టడానికి అడుగుదూరంలోనే ఉంది. అయితే ఈ ఫిగర్ రావడానికి మఠాలు కీలక పాత్ర పోషించాయంటున్నారు కమలదళాల నేతలు. కర్ణాటక రాష్ట్రంలో మఠాలకు ఒక ప్రత్యేకత ఉంది. మఠాలే రాజకీయపార్టీలను శాసిస్తాయి కూడా. పీఠాధిపతుల ఆశీర్వాదం పొందిన [more]

1 19 20 21 22 23 27