సోమిరెడ్డికి మరోసారి షాక్…!!!

23/05/2019,03:54 సా.

మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఐదో సారి కూడా షాక్ తగిలింది. ఈసారి విజయంపై ఎన్నో ఆశలు పెట్టుకొని నెల్లూరు జిల్లా సర్వేపల్లి నుంచి పోటీ చేసిన ఆయనకు ఓటమి తప్పలేదు. ఆయనపై సిట్టింగ్ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి ఘన విజయం సాధించారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి [more]

బ్రేకింగ్: గెలుపు కౌంట్ మొదలుపెట్టిన వైసీపీ

23/05/2019,01:24 సా.

ఆంధ్రప్రదేశ్ లో తిరుగులేని ఆధిక్యతతో దూసుకుపోతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తొలి విజయాన్ని నమోదు చేసింది. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎలీజా విజయం సాధించారు. విజయనగరంలో టీడీపీ అభ్యర్థి ఆదితి గజపతిరాజుపై వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి [more]

బిగ్ బ్రేకింగ్: సాయంత్రం చంద్రబాబు నాయుడు రాజీనామా..!

23/05/2019,11:43 ఉద.

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనానికి తెలుగుదేశం పార్టీ చతికిలపడింది. 150 అసెంబ్లీ నియోజకవర్గాలు దక్కించుకునే దిశగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముందుకుపోతోంది. తెలుగుదేశం పార్టీ 30 సీట్లు కూడా సాధించే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో చంద్రబాబు నాయుడు ఇవాళ సాయంత్రం ముఖ్యమంత్ర పదవికి రాజీనామా [more]

బిగ్ బ్రేకింగ్: 30న వైఎస్ జగన్ ప్రమాణస్వీకారం

23/05/2019,11:42 ఉద.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో భారీ గెలుపు దిశగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతోంది. 150 సీట్లకు పైగా గెలిచే అవకాశం కనిపిస్తోంది. ఎల్లుండి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష సమావేశం జరగనుంది. అదే రోజు వైఎస్ జగన్ ను తమ శాసనసభా పక్ష నాయకుడిగా వైసీపీ ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. [more]

బిగ్ బ్రేకింగ్: ఓటమి దిశగా నారా లోకేష్

23/05/2019,11:32 ఉద.

తెలుగుదేశం పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గాల్లోనూ ఆ పార్టీ బొక్కబోర్లా పడింది. ఆ పార్టీ కీలక నేత, మంత్రి నారా లోకేష్ సైతం ఓటమి దిశగా పయనిస్తున్నారు. ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల్లో మంగళగిరిలో నారా లోకేష్ పై వైఎస్సార్ కాంగ్స్ పార్టీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి 5,400 ఓట్ల [more]

వైసీపీ గెలుపు… పండగ చేసుకుంటున్న ఉద్యోగులు

23/05/2019,11:19 ఉద.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఓటమి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయం కావడంతో ఉద్యోగుల్లో హర్షాతిరేకలు వ్యక్తం అవుతున్నాయి. వైసీపీ ప్రభంజనం వీయడంతో ప్రభుత్వ ఉద్యోగులు బయటకు వచ్చి సంబరాలు చేసుకోవడం ఆసక్తికరంగా మారింది. ఆంధ్రప్రదేశ్ సచివాలయం బయటకు వచ్చిన ఉద్యోగులు బాణాసంచా [more]

వైసీపీ హవాలో కొట్టుకుపోతున్న జనసేన

23/05/2019,11:08 ఉద.

ఆంధ్రప్రదేశ్ లో తాము ప్రత్యామ్నాయం అని, తామే అధికారాన్ని చేపడతామని తెరమీదకు వచ్చిన జనసేన పార్టీకి ఘోర పరాభవం ఎదురవుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పారట్ హవాలో తెలుగుదేశం పార్టీ చతికిలపడగా జనసేన పార్టీ పూర్తిగా కనుమరుగైపోయింది. ఏకంగా ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సైతం వెనుకంజలో పడిపోయారు. [more]

లోక్ సభ ఎన్నికల్లో వైసీపీ హవా

23/05/2019,10:56 ఉద.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుతోంది. రాష్ట్రంలోని 25 లోక్ సభ నియోజకవర్గాల్లో 24 నియోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. కేవలం ఒక్క స్థానంలో మాత్రమే తెలుగుదేశం పార్టీ ఆధిక్యంలో ఉంది. ఇక, అసెంబ్లీకి ఇప్పటి [more]

అమెరికాలో మిన్నంటిన వైసీపీ సంబరాలు

23/05/2019,10:56 ఉద.

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభంజనం ఉండటంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. తాడేపల్లిలోని వైఎస్ జగన్ నివాసం వద్దకు పెద్ద ఎత్తున ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు చేరుకుంటున్నారు. స్వీట్లు పంచుకొని సంతోషాన్ని పంచుకుంటున్నారు. అమెరికాలో సైతం వైఎస్సార్ [more]

బిగ్ బ్రేకింగ్: సెంచరీ మార్క్ దాటిన వై.ఎస్. జగన్

23/05/2019,09:57 ఉద.

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం దిశగా దూసుకుపోతోంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో 100 సీట్లలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యతలో దూసుకుపోతోంది. తెలుగుదేశం పార్టీ కేవలం 23 నియోజకవర్గాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. జనసేన కేవలం 2 స్థానాల్లో మాత్రమే ఆధిక్యతంలో ఉంది. దీంతో వైఎస్సార్ [more]

1 2 3 137