బ్రేకింగ్ : టీడీపీకి షాకిచ్చిన కోదండరామ్

18/11/2018,05:29 సా.

ఏడు నియోజకవర్గాల్లో బిఫారాలను తెలంగాణ జనసమితి కోదండరామ్ అభ్యర్థులకు ఇవ్వడం చర్చనీయాంశమైంది. మహబూబ్ నగర్ స్థానాన్ని పొత్తుల్లో భాగంగా టీడీపీకి కేటాయించారు. అయితే అక్కడ తమ అభ్యర్థిగా రాజేందర్ రెడ్డి బరిలో ఉంటారని కోదండరామ్ తెలిపారు. అలాగే మిర్యాలగూడ స్థానానికి కూడా అభ్యర్థి విద్యాధర్ గా ప్రకటించి ఆయనకు [more]

టీడీపీలో డేట్ ఫీవర్….!!

15/11/2018,06:00 ఉద.

ఏపీలో తెలుగుతమ్ముళ్లకు తెలంగాణ ఎన్నికల టెన్షన్ పట్టుకుంది. తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీతోపొత్తు పెట్టుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇప్పటి వరకూ తెలంగాణ ఎన్నికల ప్రచారానికి వెళ్లలేదు. హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ మాత్రం ఖమ్మం జిల్లా పర్యటనకు వెళ్లి వచ్చారు.తెలంగాణలో ప్రజాకూటమిని ఏర్పాటు చేసి అక్కడ [more]

ఛాలెంజ్ 30

14/11/2018,09:00 సా.

తెలంగాణ రాష్ట్రసమితి అధినేత కొంత ఊపిరి పీల్చుకున్నారు. నామినేషన్ల ప్రక్రియ మొదలై రెండు రోజులైనా కూటమి కసరత్తు పూర్తిగా కొలిక్కిరాలేదు. మరోవైపు తమ పార్టీకి చెందిన అభ్యర్థులు దూసుకుపోతున్నారు. కొంత వ్యతిరేకత వ్యక్తమవుతున్నప్పటికీ ప్రజల్లో ఉంటున్నారు. ప్రచారం జోరుగా సాగుతోంది. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా వర్గ విభేదాలతోనే [more]

ఆ ముగ్గురికీ కష్టకాలమే

14/11/2018,11:34 ఉద.

నియంతలా మారడం వల్లనే ఆ మూడు పార్టీలూ ప్రజాదరణను కోల్పోయాయని ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. ఆయన కొద్దిసేపటిక్రితం పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఒంటెత్తు పోకడలకు పోవడం వల్లనే భారతీయ జనతా పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలను ప్రజలు ఆదరించడం లేదన్నారు. [more]

మండవకు ఎదురే లేదా…??

13/11/2018,09:00 సా.

మండవ వెంకటేశ్వరరావు… పెద్దగా పరిచయం అక్కర లేని పేరు. గత ఐదేళ్లుగా ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ తాజా ఎన్నికల్లో పోటీకి దిగుతున్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి మండవ బరిలో ఉండటం ఖరారయింది. కాంగ్రెస్, టీడీపీ పొత్తులో భాగంగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీకి కేటాయించింది. [more]

బాబు వ్యూహమా? మజాకానా? ..!!

13/11/2018,12:00 సా.

రాజకీయ చాణుక్యుడిగా పేరొందిన చంద్రబాబు ఎత్తుగడలు మాములుగా వుండవు. భవిష్యత్తును ఖచ్చితంగా అంచనా వేసి బాబు అడుగులు వేస్తారు. ఇది తెలంగాణ ఎన్నికల ముఖ చిత్రంలో మరోసారి తేటతెల్లం అయ్యింది. తెలంగాణాలో టిడిపి ఇక ముగిసిన అధ్యాయం అనే పరిస్థితి నుంచి అక్కడి రాజకీయాలను శాసించే స్థాయికి పార్టీని [more]

డీఎస్ కు సైగలే తప్ప ఛాన్స్ లేదా…?

05/11/2018,01:30 సా.

ధర్మపురి శ్రీనివాస్ టీఆర్ఎస్ లో ఉన్నట్లా..? లేనట్లా..? వచ్చే ఎన్నికల్లో ఆయన ఏపార్టీ విజయానికి కృషి చేస్తారు? ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారా? తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న వేళ ఒక సీనియర్ నేతకు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. ఇటు కాంగ్రెస్ లో చేరాలనుకున్నా అక్కడి నుంచి స్పష్టమైన [more]

త్యాగయ్యలూ…తయారుగా ఉండండి…!!

03/11/2018,09:00 సా.

తెలంగాణలో ఎన్నికలకు జట్టు కడుతున్న మహాకూటమిలో ఇప్పుడు త్యాగయ్యల వేట మొదలైంది. ప్రధానపార్టీ అయిన కాంగ్రెసు సహా అందరూ త్యాగాలు చేయాల్సిందేనని నాయకులు తేల్చేస్తున్నారు. అనుబంధ పార్టీలుగా మారనున్న టీడీపీ, టీజేఎస్, సీపీఐ ల నూ ఈ త్యాగాల బెడద ఎక్కువగానే వెన్నాడనుంది. ‘ముందుగా మీరు మార్గం చూపండి. [more]

పొంచి వున్న ముప్పు ….?

03/11/2018,06:00 ఉద.

హైదరాబాద్ లోని గాంధీభవన్ కి ముప్పు పొంచి ఉందా..? అంటే అవుననే అంటున్నాయి కాంగ్రెస్ నేతలు. ఇది ఏ తీవ్రవాదులనుంచో, మావోయిస్టులనుంచో మాత్రం కాదండి. సొంత పార్టీ వారినుంచే కావడం గమనార్హం. అదెలా అంటే కాంగ్రెస్ పార్టీ అంటే నేతల మహా సముద్రం. కొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. [more]

ఉత్తమ్ ఎత్తుగడతో…. చిత్తయినట్లేనా….??

02/11/2018,03:00 సా.

పొత్తులు కుదరిన వేళ… సీట్లు సర్దుబాటు కొలిక్కి వస్తున్న తరుణంలో పీసీసీ చీఫ్ ఉత్తమ్ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ప్రజాకూటమిలోని పార్టీలను పక్కన పెడితే సీట్ల పంపకంలో సొంత పార్టీ నేతల నుంచే ముప్పు ఉందని ఉత్తమ్ గ్రహించారు. వీరిలో సీనియర్ నేతలే ఉండటంతో ఉత్తమ్ కూడా ఏమీ [more]

1 2 3 6