మొండి మోడీకి శత్రువులెవరంటే…?

11/06/2018,09:00 సా.

నాలుగేళ్ల క్రితం నరేంద్రమోడీ హవా నడిచింది. ప్రజలు నెత్తిన పెట్టుకున్నారు. తమ ఆశల వారధిగా ఎంచుకున్నారు. అంతకుముందు మూడు దశాబ్దాల్లో ఎన్నడూ లేని విధంగా సింగిల్ పార్టీకి మెజార్టీ కట్టబెట్టారు. ఆయనలో భవిష్యత్ దార్శనికుని చూశారు. ప్రతిపక్షాలన్నీ కకావికలమైపోయాయి. ఈ నాలుగేళ్లలో మూడింట రెండు వంతుల రాష్ట్రాల్లోనూ కమలం [more]

ఆసుపత్రిలో వాజపేయి

11/06/2018,02:43 సా.

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయికి అస్వస్థతగా ఉండటంతో ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేర్చారు. ఈరోజు ఉదయం అనారోగ్యానికి గురికావడంతో కుటుంబ సభ్యులు వెంటనే వాజపేయిని ఎయిమ్స్ కు తరలించారు. ఈ విషయాన్ని బీజేపీ నేతలు ధృవీకరించారు. 93 ఏళ్ల వాజపేయి గత కొంతకాలంగా అనారోగ్యంతో [more]

కమలం ఇమేజ్ భారీగా డామేజ్ అయిందే…!

09/06/2018,11:59 సా.

వచ్చే ఎన్నికల్లో బీజేపీకి భంగపాటు తప్పదా? మిత్రులంతా దూరమవుతున్న వేళ ఆ పార్టీ ఇమేజ్ క్రమంగా తగ్గిపోతుందా? అంటే అవుననే చెబుతోంది ఈ సర్వే. ఇటీవల బీజేపీ ఒక అంతర్గత సర్వే చేయించుకుంది. తాము సొంతంగా చేయించుకున్న ఈ సర్వేలో కమలనాధులకు దిమ్మ తిరిగిపోయే ఫలితాలు కన్పించాయి. వచ్చే [more]

అబ్బో ..హత్యా రాజకీయాలు…!

09/06/2018,09:00 సా.

ప్రధానిపై హత్యాయత్నానికి కుట్ర. పెద్ద వార్తే. మీడియాలో పతాక శీర్షికలకు ఎక్కే సంచలనం. అంతకుమించి జాతి మొత్తం ఆందోళన చెందాల్సిన అంశం. నిఘా, నేరపరిశోధక, దర్యాప్తు సంస్థలు అట్టుడికిపోవాల్సిన ఐటెం. కానీ మనదేశం సంగతే వేరు. రాజకీయం అలుముకుంది. రగడ మొదలైంది. సీరియస్ నెస్ తగ్గిపోయింది. చీప్ పాలిటిక్స్ [more]

మోడీతో అమితుమీకి రెడీ

09/06/2018,07:30 ఉద.

చాలా రోజుల తర్వాత మోడీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భేటీ కానున్నారు. నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. ఈ నెల 16వ తేదీన జరిగే ఈ బేటీకి చంద్రబాబు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని, విభజన హామీల [more]

అక్షరం అబ్బకపోయినా…..!

08/06/2018,11:59 సా.

తేజస్వీ యాదవ్…. బీహార్ రాజకీయాల్లో తెరపైకి వచ్చిన కొత్తతరం నాయకుడు. విపక్ష నేతగా వెలుగులీనుతూ ప్రభుత్వాన్ని ఉరుకులు, పరుగులు పెట్టిస్తున్నారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ రెండో కుమారుడైన తేజస్వీ యాదవ్ రాష్ట్ర [more]

నితీష్….నిమిత్త మాత్రుడేనా?

08/06/2018,11:00 సా.

నితీష్ కుమార్… భారత రాజకీయాల్లో సుపరిచిత నాయకుడు. బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న నాయకుడు. రాజకీయాల్లో నైతిక విలువలకు పెద్దపీట వేసిన నేతగా పేరుంది. ఒక దశలో విపక్షాల ఉమ్మడి ప్రధాని అభ్యర్థిగా ఆయన పేరు తెరపైకి వచ్చింది. కాంగ్రెస్, బీజేపీయేతర జాతీయ, ప్రాంతీయ పార్టీలకు నితీష్ [more]

యూపీతో బీపీ తప్పదా?

08/06/2018,10:00 సా.

దేశరాజకీయాలకు గుండెకాయ వంటిది ఉత్తరప్రదేశ్. అత్యధికంగా 80 లోక్ సభ స్థానాలతో విరాజిల్లుతున్న ఈ ఉత్తరాది రాష్ట్రంలో పట్టు సాధించిన పార్టీలే హస్తినను హస్తగతం చేసుకుంటున్నాయి. ఇక్కడ ఓడిపోయిన పార్టీలు ఢిల్లీ రాజకీయాల్లో విపక్షానికే పరిమితమవుతున్నాయి. చరిత్ర చెబుతున్న సత్యమిది. 2014 లోక్ సభ ఎన్నికల్లో మొత్తం 73 [more]

కమలానికి కొంత ఊరట…!

07/06/2018,11:59 సా.

బీజేపీకి కొంత ఊరట లభించినట్లయింది. మిత్రపక్షాలు ఒక్కొక్కటిగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో భాగస్వామ్య పక్షాల్లో ఒక్కటైన అకాళీదళ్ తాము ఎన్డీఏతో ఉంటామని స్పష్టం చేయడం విశేషం. ఎన్డీఏలోని భాగస్వామ్య పక్షాలను సంతృప్తి పర్చేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. భాగస్వామ్య [more]

మోడీ మరో సంచలన నిర్ణయం

13/05/2018,11:59 సా.

ఇకపై దేశంలోని రోడ్లపై విప్లవాత్మక మార్పులు చోటు చేసుకోనున్నాయి. పర్యావరణ హితానికి పెద్దపీట వేయడమే లక్ష్యంగా కేంద్రప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అన్ని విధాలా నష్టం తెస్తున్న డీజిల్, పెట్రోల్ వాహనాలకు స్వస్తి పలికి విద్యుత్ వాహన శకానికి తెరతీయాలంటే ప్రభుత్వ పరంగా ప్రజలకు చేయూత ఇవ్వాలని సర్కార్ [more]

1 14 15 16 17
UA-88807511-1