బిజెపి పంటికింద రాయి…!

07/06/2018,11:00 సా.

కాంగ్రెస్ కు శత్రువు, మిత్రుడు ఆ పార్టీ వారే అంటారు. అలానే తయారైంది కమలం పార్టీ పరిస్థితి. ప్రత్యర్థి పార్టీ విమర్శించేలోగానే సొంత పార్టీ వారే ఏకి పారేయడం కాంగ్రెస్ నేతలకే చెల్లింది. ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి కి సొంత పార్టీ నేతల నుంచే అక్షింతలు [more]

జరగని పెళ్లికి.. జీలకర్ర బెల్లం..!

07/06/2018,10:00 సా.

ఎంపీల రాజీనామాలు కూడా అయిపోయాయి. అందరూ అదే మాట. చంద్రబాబు స్టేజీ ఎక్కితే చాలు వల్లె వేసే మంత్రమదే. జగన్ బృందానికి జయగీతమూ అదే. పవన్ ఎప్పుడో చెప్పేశాడు తన పంథా అదేనని. కాంగ్రెసు అయితే అధికారంలోకి వస్తే తొలి సంతకమని ప్రకటించేసింది. ఈ ప్రత్యేక హోదా అనే [more]

బీజేపీకి భ‌యం ఎందుకు ప‌ట్టుకుంది..

07/06/2018,06:00 సా.

సార్వ‌త్రిక ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో బీజేపీ వైఖ‌రిలో మార్పు వ‌స్తోంది. నాలుగేళ్ల పాటు ఎన్డీయే భాగ‌స్వామ్య ప‌క్షాల‌ను లెక్క‌చేయ‌కుండా.. ఒంటెత్తుపోక‌డ పోయిన ఆ పార్టీ ఇప్పుడు వ్యూహం మార్చుకుంటోంది. మిత్ర‌ప‌క్షాల‌ను బుజ్జ‌గించే ప‌నిలో నిమ‌గ్న‌మైంది. ఇందులో భాగంగా ఏకంగా బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్‌షా మిత్ర‌ప‌క్షాల నేత‌ల్లో కీల‌మైన [more]

`కారు` జోరుకు బ్రేకులు.. దారుణంగా ప‌డిపోయిన గ్రాఫ్‌..

07/06/2018,01:30 సా.

2019 ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో కారు ఎంత వేగంతో దూసుకుపోతుంది? మాట్లాడితే 100కు పైగా సీట్లు వ‌స్తాయ‌ని ఎంతో ధీమాగా చెప్పే గులాబీ బాస్ కేసీఆర్.. ఇంత హ‌డావుడిగా అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌పై వ‌రాలు ఎందుకు ప్ర‌క‌టిస్తున్నారు? దీని వెనుక ఉన్న మ‌త‌ల‌బు ఏమిటి? అనే సందేహాలు అంద‌రిలోనూ వ‌స్తున్నాయి! [more]

నమ్మినబంటుకు నజరానా దక్కేనా..?

06/06/2018,05:00 సా.

డీకే.శివకుమార్… కాంగ్రెస్ పార్టీని కష్టకాలంలో ఆదుకునే కన్నడ లీడర్. కేవలం కన్నడ నాట మాత్రమే కాదు. ఇతర రాష్ట్రాల్లో పార్టీకి ఇబ్బందులు వచ్చినా ఆయన పార్టీ మేలు కోసం తన శక్తిమేర పనిచేశాడు. ఇందుకు బహుమతిగా ఆయన కేంద్ర ప్రభుత్వ ఆగ్రహానికి, సీబీఐ, ఈడీ, ఇన్ కమ్ ట్యాక్స్ [more]

కొలువుదీరిన మంత్రివర్గం…

06/06/2018,03:10 సా.

ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెండువారాలకు ఎట్టకేలకు కర్ణాటకలో పూర్తిస్థాయి మంత్రివర్గం కొలువుదీరింది. గవర్నర్ వాజుభాయ్ వాలా రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన 14 మంది ఎమ్మెల్యేలు, జేడీఎస్ కు చెందిన 7 మంది ఎమ్మెల్యేలుగా ప్రమాణస్వీకారం చేశారు. ఎన్నికలకు ముందు [more]

ఏపీలో పంచ‌తంత్రం….ఎవ‌రి మంత్రం పారుతుందో..

05/06/2018,11:30 సా.

ఏపీ రాజ‌కీయ పంచ‌తంత్రంలో ఎవ‌రి మంత్రం పారుతుంది..? చంద్ర‌బాబు మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తారా..? ప్ర‌జాసంక‌ల్ప‌యాత్ర జ‌గ‌న్ క‌ల‌ను నెర‌వేరుస్తుందా..? సుడిగాలిలా వ‌చ్చిన ప‌వ‌న్ అజేయుడిగా నిలుస్తారా..? గ‌త ఎన్నిక‌ల్లో ప‌త్తాలేకుండా పోయిన కాంగ్రెస్ ఈసారి స‌త్తాచాటుతుందా..? ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌కుండా మాట త‌ప్పిన బీజేపీ ప‌రాభ‌వం మూట‌గ‌ట్టుకోక త‌ప్ప‌దా..? [more]

కేసీఆర్ కు రెడ్డి ఎమ్మెల్యేల షాక్‌.. ఫ‌లిస్తున్న‌ కాంగ్రెస్ వ్యూహం

05/06/2018,08:30 సా.

ఎన్నిక‌ల ఏడాదిలో రాజకీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో రాజ‌కీయ వాతావ‌ర‌ణం మ‌రింత వేడెక్కుతోంది. ఏపీలో ఇప్ప‌టికే త్రిముఖ పోరుకు సిద్ధ‌మ‌వ‌గా.. తెలంగాణ రాజ‌కీయాల్లో ఇప్పుడిప్పుడే పెను మార్పులు జ‌రుగుతున్నాయి. సీఎం కేసీఆర్‌ను ఢీకొట్టేందుకు ప్ర‌తిప‌క్షాల‌న్నీ ప్ర‌య‌త్నిస్తున్నా అది సాధ్యం కావ‌డం లేదు. ఈ నేప‌థ్యంలోనే సామాజిక‌వ‌ర్గ [more]

కాంగ్రెస్ సీనియర్ నేతకు సమన్లు

05/06/2018,05:48 సా.

సునందా పుష్కర్ అనుమానాస్పద మృతి కేసులో ఆమె భర్త, కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ కి ఢిల్లీలోని పాటియాలా హౌజ్ కోర్టు సమన్లు జారీ చేసింది. జులై 7న కోర్టు లో హాజరుకావాలని ఆదేశించింది. భార్య మృతి కేసులో ఎంపీ శశిథరూర్ ను నిందితుడిగా పేర్కొంటూ దిల్లీ [more]

రేవంత్ మౌన‌వ్ర‌తం వెన‌క క‌థ ఇదే

05/06/2018,08:30 ఉద.

తెలంగాణ రాజ‌కీయాల్లో రేవంత్‌రెడ్డిది ప్ర‌త్యేక పంథా.. త‌న ప‌దునైన వాగ్ధాటితో ప్ర‌త్య‌ర్థులతో చుక్క‌లు లెక్క‌పెట్టించ‌డంలో ఆయ‌న‌కు మ‌రెవ‌రూ సాటి రార‌ని అంటుంటారు. ప్ర‌ధానంగా టీఆర్ఎస్ అధినేత‌, సీఎం కేసీఆర్‌నుగానీ, మంత్రి కేటీఆర్‌ను గానీ విమ‌ర్శించ‌డానికి ఆయ‌న వాడే ప‌ద‌జాలం ఫిదా చేస్తుందంటే అతిశ‌యోక్తి కాదు. ఆయ‌న తెలుగుదేశం పార్టీలో [more]

1 89 90 91 92 93 127