ఆదాల అసహనం…ఎవరికి నష్టం..?

31/08/2018,06:00 సా.

నెల్లూరులో తెలుగుదేశం పార్టీకి అస్సలు అచ్చిరావడం లేదు. ఎన్నికల సమీపిస్తున్నకొద్దీ నేతల మధ్య విభేదాలు పెరుగుతున్నాయే తప్ప తొలగడం లేదు. ముఖాముఖి తేల్చుకునేందుకు సిద్ధపడుతున్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నుంచి కీలక నేత ఆనం రామనారాయణరెడ్డి పార్టీని వీడి వెళుతుండటం టీడీపీకి మైనస్. గత ఎన్నికల్లోనూ అరకొర సీట్లు [more]

రాజీలేదు…రణమేనా?

29/08/2018,06:00 సా.

కడప జిల్లాలో బద్వేలు రాజకీయం ఎవరికీ అంతుపట్టదు. అప్పటికప్పుడు అగ్రనేతలు వస్తే రాజీ పడిపోయామంటారు. వారు అటు వెళ్లగానే మళ్లీ విభేదాలు మొదలు. బద్వేలు అంటేనే తెలుగుదేశం పార్టీ అధినేతకు భయం పట్టుకుంటుంది. ఎప్పుడు ఎవరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న టెన్షన్ టీడీపీ అగ్రనేతల్లో ఉంది. ఎన్నిసార్లు స్వయంగా [more]

ప్చ్….ఆనం ఎలాగుండేవారు…?

29/08/2018,04:30 సా.

ఆనం రామనారాయణరెడ్డి. దశాబ్దాల పాటు రాజకీయాలు ఏలిన చరిత్ర కలిగిన కుటుంబం. ఏరోజూ టిక్కెట్ల కోసం ఎదురుచూడని పరిస్థితి ఆనం ఫ్యామిలీది. అడక్కుండానే….టిక్కెట్లు వచ్చాయి. నియోజకవర్గం మారినా ఎటువంటి సందేహాలు లేకుండా నేరుగా సీటు దక్కించుకున్న ఘనత ఆనం కుటుంబీకులది. అటువంటి ఆనం రామనారాయణరెడ్డి కొంతకాలంగా టిక్కెట్ కోసం [more]

నంద్యాల ఫార్ములాను మళ్లీ తెచ్చారా?

28/08/2018,06:00 సా.

వచ్చే ఎన్నికల్లోనూ నంద్యాల లాంటి గెలుపు కావాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. నంద్యాల ఉప ఎన్నికలు జరిగిన తర్వాత కూడా నంద్యాల తరహాలోనే కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ అదే వ్యూహాన్ని రచించారు. రెండింటా సక్సెస్ కావడంతో చంద్రబాబు అప్పట్లో నంద్యాల ఫార్ములా వర్క్ అవుట్ అయిందని చెప్పారు. [more]

సోమిరెడ్డి విక్టిమ్స్ ఏకమవుతున్నారే….!

28/08/2018,03:00 సా.

మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని ఢీకొట్టేందుకు శత్రువులు మిత్రులయ్యారు. బద్ధ వ్యతిరేకులే మళ్లీ మిత్రులయ్యారు. నెల్లూరు జిల్లాలో రాజకీయాలు ఊహించని మలుపులు తీసుకుంటున్నాయి. ఇద్దరూ ఒకప్పడు మిత్రులే. అయితే రాజకీయంగా వారు విడిపోయి శత్రువులయ్యారు.కాని ఇప్పుడు సోమిరెడ్డి బాధితులు కావడంతో తిరిగి మిత్రులుగా మారారు. వారే ఆనం రామనారాయణరెడ్డి, [more]

అయిపోయింది….బయటపడ్డారు…!

23/08/2018,03:00 సా.

వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించి మరోసారి అధికార పీఠాన్ని అందుకోవాలని భావిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడికి అమాత్యులే అడ్డంకిగా మారుతున్నారు. ముఖ్యంగా ఒక జిల్లాలో ఉండే మంత్రులకు ఒకరంటే ఒకరు పడటం లేదు. గ్రూపులను ప్రోత్సహిస్తున్నారు. బహిరంగంగా వ్యాఖ్యలు కూడా చేసుకుంటున్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచి మొదలు [more]

పెళ్లిళ్లు, పెళ్లాల గురించి జగన్ కే తెలియాలి

22/08/2018,01:09 సా.

పెళ్లిళ్లు, పెళ్లాల గురించి జగన్ కే తెలియాలని ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. తమను విమర్శించే హక్కు జగన్ కు లేదన్నారు. కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలను ఏకం చేసేది ఒక్క టీడీపీ మాత్రమే నని యనమల అభిప్రాయపడ్డారు. కాబోయే ప్రధానిని నిర్ణయించేది తెలుగుదేశం పార్టీయేనని, వచ్చే [more]

సోమిరెడ్డి వల్ల జగన్ కు ఎంత లాభమంటే?

22/08/2018,07:00 ఉద.

ఆయ‌న సీనియ‌ర్ పొలిటీషియ‌న్.. కానీ, ప్ర‌జ‌లే గుర్తించలేదు. ఆయ‌న‌కు చెప్పుకోద‌గ్గ పార్టీ అభిమానం ఉంది. కానీ, వెన‌కాల ప్ర‌జ‌లే లేరు. మ‌రి రాజ‌కీయ నాయ‌కుడ‌న్నాక‌.. జైకొట్టే జ‌నాలు లేన‌ప్పుడు ప్ర‌యోజ‌న‌మేమ‌ప్పా?! అంటున్నారు పార్టీలోని ఇత‌ర నాయ‌కులు! ఈ ప‌రిస్థితి ఇప్పుడు నెల్లూరు కుచెందిన సీనియ‌ర్ రాజ‌కీయ రెడ్డిగారు.. సోమిరెడ్డి [more]

టీడీపీ గెలుపు గుర్రాలు సిద్ధం!!

16/08/2018,04:30 సా.

“రాజ‌కీయాల్లో వార‌స‌త్వాన్ని ప్రోత్స‌హించేది లేదు“- అన్న నోటి నుంచే.. త‌న కుమారుడిని సైలెంట్‌గా తెర‌మీదికి తెచ్చా రు టీడీపీ అధినేత చంద్ర‌బాబు! ఒక‌ప్పుడు రాజ‌కీయ వార‌సుల‌కు కేరాఫ్‌గా ఉన్న కాంగ్రెస్‌ను మించిపోయేలా ఇప్పుడు ఏపీలో అధికార టీడీపీలో వార‌సుల సంఖ్య భారీ సంఖ్య‌లోనే ఉండ‌డం గ‌మ‌నార్హం. దాదాపు 30 [more]

నమ్మి నెత్తికెక్కించుకుంటే….?

12/08/2018,06:00 సా.

చంద్రబాబు ఎవరైతే నమ్మి నెత్తికెక్కించుకున్నారో…వారే ఇప్పుడు జిల్లాల్లో ముఠా తగాదాలకు మూలంగా మారారు. సాధారణంగా చంద్రబాబు ఇదివరకటి సీఎం అయితే ఎవరినీ ఉపేక్షించరు. కాని ఇప్పుడు చిన్న రాష్ట్రం కావడం…..బలమైన ప్రతిపక్షం ఉండటంతో ద్వితీయ శ్రేణి నేతలను కూడా చంద్రబాబే స్వయంగా బుజ్జగించాల్సి వస్తుంది. ఇది అలుసుగా చేసుకుని [more]

1 2 3 4 5 6