ఒంటరిగా వెళితే ఇంతేనా…?

23/05/2019,04:30 సా.

అంతా అనుకున్నట్లే అయింది. నారా చంద్రబాబునాయుడుకు ఉన్న వీక్ నెస్ గురించి అందరూ అనుకుంటుందే. ఆయన ఒంటరిగా పోటీ చేసి ఎప్పుడూ గెలవలేదు. ఆయన కూటమితో వెళ్లినప్పుడే గెలపు సాధ్యమయింది. ఈసారి చంద్రబాబునాయుడుతో జత కట్టేందుకు ఏ పార్టీ సిద్దంగా లేదు. కాంగ్రెస్ కలసి వచ్చే అవకాశమున్నా చంద్రబాబునాయుడు [more]

సైకిల్ గాలి తీసేసింది అవేనా…??

23/05/2019,03:00 సా.

ఐదేళ్లుగా ఏమీ చేయకుండా నాన్చడమే చంద్రబాబు చేసిన తప్పా…? చివరి నిమిషంలో హడావిడి చేస్తే ప్రజలు నమ్మలేదా? అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. నారా చంద్రబాబునాయుడు నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నేత. రాష్ట్ర విభజన జరిగిన వెంటనే ఆయనను ఏపీ ప్రజలు నమ్మారు. భారతీయ జనతా [more]

లగడపాటి మళ్లీ ఫూల్ అయ్యారు..!!

23/05/2019,02:00 సా.

లగడపాటి రాజగోపాల్… ఈ నెల 19వ తేదీన మరోసారి చెప్పిన జోస్యం కూడా అట్టర్ ప్లాప్ అయింది. లగడపాటి సర్వేల్లో విశ్వసనీయత ఉంటుందని అందరూ నమ్ముతారు. గతంలో జరిగిన ఎన్నికల్లో కొన్ని సర్వేలు నిజం కావడంతో ఆయన సర్వేలపై జనం నమ్మకం పెట్టుకున్నారు. తెలంగాణ ఎన్నికల విషయానికి వచ్చే [more]

గుద్దిపడేశారంతే…!!

23/05/2019,12:50 సా.

ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికలు ఏకపక్షంగా జరిగాయని చెప్పక తప్పదు. ఆంధ్ర ఓటర్లు ఫ్యాన్ పార్టీ గుర్తు మీద గుద్దిపడేశారు. తెలుగుదేశానికి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఏ జిల్లాలోనూ తెలుగుదేశం పార్టీ పైచేయి సాధించలేకపోయింది. తెలుగుదేశం పార్టీకి పటిష్టమైన ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ జగన్ గాలి ముందు అది [more]

బ్రేకింగ్ : ఫ్యాన్ వేవ్ మామూలుగా లేదు…!!!

23/05/2019,09:38 ఉద.

ఆంధ్రప్రదేశ్ లో ఫ్యాన్ గాలి మామూలుగా లేదు. జగన్ పాదయాత్ర ఫలితమో.. లేదా చంద్రబాబు ప్రభుత్వ వ్యతిరేకతతో తెలియదు కాని రాయలసీమ జిల్లాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్వీప్ దిశగా పయనిస్తోంది. ప్రధాన టీడీపీ అభ్యర్థులు వెనుకంజలో ఉన్నారు. కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లోని అనేక నియోజకవర్గాల్లో [more]

బ్రేకింగ్ : ఫైర్ బ్రాండ్ ముందంజ…!!!

23/05/2019,09:28 ఉద.

నగరి నియోజకవర్గంలో వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా ముందంజలో ఉన్నారు. అక్కడ టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ వెనుకంజలో ఉన్నారు. అయితే తొలి రౌండ్ ముగిసే సరికి రోజా దాదాపు 600 ఓట్ల పై చిలుకు ఆధిక్యంలో ఉన్నారు. మిగిలిన రౌండ్లలో ఎవరు ఆధిక్యత ప్రదర్శిస్తారన్నది ఉత్కంఠగా మారింది. [more]

బ్రేకింగ్ : కళా వెంకట్రావు వెనుకంజ

23/05/2019,09:23 ఉద.

శ్రీకాకుళం జిల్లాలో ఎచ్చర్ల నియోజకవర్గంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు వెనుకంజలో ఉన్నారు. ఆయన తన సమీప ప్రత్యర్థి గొర్ల కిరణ్ కుమార్ ఆధిక్యంలో ఉన్నారు. కళా వెంకట్రావుకు ఇక్కడ వైసీపీ గట్టి పోటీ ఇచ్చిందని తొలి నుంచి విశ్లేషణలు వెలువడుతున్నాయి.

బ్రేకింగ్ : ఆ మూడింటిలో టీడీపీ

23/05/2019,09:18 ఉద.

తెలుగుదేశం పార్టీ మూడు పార్లమెంటు స్థానాల్లో ముందంజలో ఉంది. కాకినాడ, అమలాపురం నియోజకవవర్గంలో టీడీపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. అలాగే గుంటూరు పార్లమెంటు స్థానంలో టీడీపీ అభ్యర్థి గల్లా జయదేవ్ 1300 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఈ మూడు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతుండటం విశేషం.

బ్రేకింగ్ : కాల్వ ఎదురీత..!

23/05/2019,09:14 ఉద.

రాయదుర్గం అసెంబ్లీ నియోజకవర్గంలో మంత్రి కాల్వ శ్రీనివాసులు వెనుకంజలో ఉన్నారు. ఇక్కడ వైసీపీ అభ్యర్థి కాపు రామచంద్రారెడ్డి తొలి రౌండ్ లో ఆధిక్యంలో ఉన్నారు. కాపు రామచంద్రారెడ్డి గెలుపు దిశగా పయనిస్తున్నారు. ఇక్కడ మంత్రిగా ఉండి పోటీ చేసిన కాల్వ శ్రీనివాసులు వెనుకంజలో ఉన్నారు.

బ్రేకింగ్ : రాజోలులో జనసేన…!

23/05/2019,09:05 ఉద.

భీమవరం నియోజకవర్గంలో పవన్ కల్యాణ్ వెనకబడి ఉన్నా అదే జిల్లాలోని రాజోలు నియోజకవర్గంలో మాత్రం జనసేన ముందంజలో ఉండటం విశేషం. రాజోలు నియోజకవర్గం తొలిరౌండ్ ముగిసేసరికి జనసేన అభ్యర్థి 169 ఓట్లు ఆధిక్యంలో ఉన్నారు. ఇక్కడ వైసీపీ రెండో స్థానంలో ఉంది. తెలుగుదేశం పార్టీ మూడో స్థానంలో ఉంది.

1 2 3 314