బస్తీ మే సవాల్ అంటున్న వర్మ

25/05/2019,03:43 సా.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు పూర్తయ్యాయి. ఎవరూ ఊహించని విధంగా ఆంధ్రప్రదేశ్ ఫలితాలు వచ్చాయి. తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయింది. కేవలం 23 సీట్లతో టీడీపీ సరిపెట్టుకుంది. ఇటువంటి పరిస్థితిల్లో చంద్రబాబు కుంగిపోవడం సహజం. అయితే ఇప్పుడు వర్మ దీని క్యాష్ చేసుకున్నాడు. ఇదే సరైన టైం అనుకున్న వర్మ పుండు [more]

విజయంపై జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు

25/05/2019,11:49 ఉద.

ప్రజలు తమపై ఎంతో విశ్వాసంతో గొప్ప విజయాన్ని అందించారని, ఈ విజయం తమపై మరింత బాధ్యత పెంచిందని కాబోయే ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఆరు నెలలలో జగన్ మంచి ముఖ్యమంత్రి అనేలా మన పరిపాలన ఉంటుందన్నారు. శనివారం తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ [more]

జగన్ ను నమ్మారు… గెలిచారు..!

24/05/2019,06:00 సా.

ఒక నాయకుడిని నమ్మకొని ఉంటే.. కష్టాలెదురైనా పార్టీని నమ్ముకొని ఉంటే భవిష్యత్ బాగుంటుందని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో నిరూపితమైంది. జగన్ నమ్ముకొని ఉన్న నేతలు ఇవాళ రాజకీయంగా తమ భవిష్యత్ ను మెరుగుపరుచుకున్నారు. జగన్ జెండాతో గెలిచి తాత్కాలిక అధికారం కోసం టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల రాజకీయ జీవితం [more]

జగన్ గెలుపుతో ఎన్టీఆర్ మనోవాంఛ నెరవేరింది

24/05/2019,01:51 సా.

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం పట్ల తెలుగుదేశం పార్టీ మాజీ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు సంబరాల్లో మునిగిపోయారు. ఇవాళ ఆయన అనుచరులతో కలిసి హైదరాబాద్ లో ఎన్టీఆర్ ఘాట్ కు నివాళులర్పించారు. ఆయన అనుచరులు ఎన్టీఆర్ ఘాట్ వద్ద బాణాసంచా [more]

చంద్రబాబు ఫోటోలు, మంత్రుల నేమ్ ప్లేట్స్ తొలగింపు

24/05/2019,01:13 సా.

ఆంధ్రప్రదేశ్ లో వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో నూతన ప్రభుత్వం ఏర్పడనున్నందున సచివాలయంలో మాజీ మంత్రుల నేమ్ ప్లేట్లను తొలగిస్తున్నారు. ఇప్పటికే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటోలను సైతం తొలగించారు. సాధారణ పరిపాలన శాఖా ఆదేశాల మేరకు మంత్రుల పేషీల్లో వారి నేమ్ ప్లేట్లను తొలగిస్తున్నారు.

ఇంత ఘోరంగా ఓడిపోతామనుకోలేదు

24/05/2019,12:07 సా.

ప్రజలు ఇంత ఉదృతంగా మార్పు కోరుకుంటారని, ఇంతలా ఓడిపోతామని అనుకోలేదని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బుద్దా వెంకన్న పేర్కొన్నారు. ఫలితాలకు ముందు తాము కచ్చితంగా విజయం సాధిస్తామని తొడగొట్టి మరీ చెప్పిన వెంకన్న ఇవాళ ఫలితాలపై స్పందించారు. చంద్రబాబు నాయుడు చాలా మంచి వారని, రోజుకు 18 గంటలు [more]

జంప్ జిలానీల గతి ఇంతే…!!

24/05/2019,09:00 ఉద.

ఒక పార్టీ నుంచి గెలిచి అధికారం కోసం మరో పార్టీలో చేరిన ఎమ్మెల్యేలకు ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు గట్టిగా సమాధానం చెప్పారు. గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా, జగన్ ఫోటో పెట్టుకొని గెలిచిన ఎమ్మెల్యేల్లో 23 మంది అధికార తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీ [more]

ఓటమిపై చంద్రబాబు కామెంట్ ఇదే…!!

23/05/2019,07:24 సా.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గెలిచిన జగన్, కేంద్రంలో గెలిచిన నరేంద్ర మోడీ, ఒడిశాలో విజయం సాధించిన నవీన్ పట్నాయక్ కు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల ఫలితాలను గౌరవించడం అందరి బాధ్యత అని ఆయన తెలిపారు. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలు, శ్రేయోభిలాషులకు, ఓట్లేసిన [more]

రికార్డు మెజారిటీ దిశగా జగన్… సగానికి తగ్గిన బాబు మెజారిటీ

23/05/2019,04:14 సా.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం ముఖ్యమంత్రి స్వంత నియోజకవర్గాన్నీ తాకింది. చిత్తూరు జిల్లాలో 10 స్థానాలకు పైగా గెలుచుకుంటున్న వైసీపీ కుప్పంలో చంద్రబాబు మెజారిటీని సగానికి తగ్గించేసింది. గత ఎన్నికల్లో 50 వేలకు పైగా మెజారిటీతో గెలిచిన చంద్రబాబు ఈసారి కేవలం 29 వేల మెజారిటీతో విజయం సాధించారు. [more]

బిగ్ బ్రేకింగ్: సాయంత్రం చంద్రబాబు నాయుడు రాజీనామా..!

23/05/2019,11:43 ఉద.

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనానికి తెలుగుదేశం పార్టీ చతికిలపడింది. 150 అసెంబ్లీ నియోజకవర్గాలు దక్కించుకునే దిశగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముందుకుపోతోంది. తెలుగుదేశం పార్టీ 30 సీట్లు కూడా సాధించే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో చంద్రబాబు నాయుడు ఇవాళ సాయంత్రం ముఖ్యమంత్ర పదవికి రాజీనామా [more]

1 2 3 81