టీఆర్ఎస్ లో ఎమ్మెల్యే.. ఆయన భార్య కాంగ్రెస్ కు మద్దతు

10/04/2019,01:46 సా.

భువనగిరి పార్లమెంటు అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య భార్య పార్వతమ్మ మద్దతు తెలిపారు. కోమటిరెడ్డి సోదరులకు అనుచరుడైన చిరుమర్తి లింగయ్య కాంగ్రెస్ నుంచి గెలిచి ఇటీవల టీఆర్ఎస్ లో చేరారు. టీఆర్ఎప్ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ కు ఆయన మద్దతు ఇచ్చారు. [more]

ఉత్తమ్ వల్లే పార్టీ మారుతున్నా

11/03/2019,03:52 సా.

పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విధానాలు నచ్చకనే కాంగ్రెస్ కి రాజీనామా చేసినట్లు నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పేర్కొన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓ సైకోలా వ్యవహరిస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ శంషాబాద్ బహిరంగ సభకు 10 వేల మంది కూడా హాజరుకాలేదంటే [more]

కాంగ్రెస్ పెద్దలు చేతులెత్తేశారా..?

09/03/2019,09:00 ఉద.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆ పార్టీ నుంచి వరుసగా నేతలు జారిపోతున్నారు. మొదట ఇద్దరు ఎమ్మెల్సీలు పార్టీ మారి ఏకంగా పార్టీ శాసనమండలి పక్షాన్నే టీఆర్ఎస్ లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల వేళ [more]

బ్రేకింగ్: రాహుల్ వచ్చే లోపే జంప్..?

08/03/2019,11:47 ఉద.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగలనుంది. నకిరేకల్ ఎమ్మెల్యే, కోమటిరెడ్డి బ్రదర్స్ అనుచరుడు చిరుమర్తి లింగయ్య టీఆర్ఎస్ లో చేరనున్నారు. ఈ మేరకే ఆయన టీఆర్ఎస్ నేతలతో చర్చలు జరుపుతున్నారు. ఆయన కాంగ్రెస్ నేతలకు అందుబాటులోకి రాకుండా అజ్ఞాతంలోకి వెళ్లారు. త్వరలోనే ఆయన టీఆర్ఎస్ లో చేరతారని [more]

బ్రేకింగ్ : పెరుగుతున్న అసమ్మతి గళం

17/01/2019,10:10 ఉద.

కాంగ్రెస్ లెజెస్లేచర్ పార్టీ నేత ఎంపిక కాంగ్రెస్ కు తలనొప్పిగా మారింది. గెలిచిన 19 మంది ఎమ్మెల్యేలతో పార్టీ పరిశీలకులు కె.సి.వేణుగోపాల్ సమావేశమయ్యారు. అయితే ఈ సమావేశంలో సీఎల్పీ నేత ఎంపికపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఎల్బీనగర్ శాసనసభ్యుడు సుధీర్ రెడ్డి తనకే సీఎల్పీ పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. [more]

కోమటిరెడ్డి దెబ్బకు హైకమాండ్ దిగొచ్చిందే…!!!

09/11/2018,06:18 సా.

కోమటిరెడ్డి వెంకటరెడ్డి కఠిన నిర్ణయాన్ని ప్రకటించడంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దిగొచ్చింది. నకిరేకల్ సీటు చిరుమర్తి లింగయ్య కు టిక్కెట్ ఇవ్వకుంటే తాను కూడా నల్గొండలో పోటీ చేయనని ఆయన ప్రకటించారు. నకరేకల్ సీటును తెలంగాణ ఇంటిపార్టీకి కేటాయించనున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో కోమటిరెడ్డి పై విధంగా స్పందించారు. [more]

కారు అదే స్పీడు కొనసాగిస్తుందా?

01/07/2018,07:00 ఉద.

నల్గొండ జిల్లాలో నల్గొండ పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాలను మినహాయిస్తే భువనగిరి పార్లమెంటు పరిధిలో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పూర్తి ఆధిపత్యాన్ని చూపించింది. అయితే, ఇదే సందర్భంలో కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ [more]