బ్రేకింగ్: సిద్ధూ త్యాగం ఫలించేనా?

15/05/2018,09:17 ఉద.

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య త్యాగం ఫలించేటట్లుంది. ఆయన తన కుమారుడు యతీంద్ర కోసం తనకు పట్టున్న వరుణ నియోజకవర్గాన్ని త్యాగం చేశారు. అక్కడ కుమారుడు యతీంద్రకు అవకాశం కల్పించారు. తాను బాదామి, చాముండేశ్వరి నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు. బాదామిలో ముందంజలో ఉన్న సిద్ధరామయ్య చాముండేశ్వరిలో మాత్రం వెనుకంజలో ఉన్నారు. [more]

బ్రేకింగ్: శ్రీరాములుకు సిద్ధూ ఝలక్ ఇస్తారా?

15/05/2018,09:10 ఉద.

బాదామి నియోజకవర్గంలో శ్రీరాములు వెనుకబడి ఉండటం ఆ పార్టీనేతలను ఆందోళనకు గురిచేస్తోంది. సీఎం సిద్ధరామయ్యను ఎలాగైనా ఓడించాలని బాదామిలో గాలి జనార్థన్ రెడ్డి అనుచరుడు శ్రీరాములును రంగంలోకి దించారు. బీజేపీ అధికారంలోకి వస్తేవ శ్రీరాములును ఉప ముఖ్యమంత్రిగా కూడా చేయాలని బీజేపీ అధిష్టానం భావిస్తోందన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో [more]

బ్రేకింగ్: హంగ్ దిశగానేనా?

15/05/2018,09:01 ఉద.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ట్రెండ్స్ హంగ్ దిశగా కొనసాగుతున్నాయి. మొత్తం 186స్థానాల్లో ఓట్ల లెక్కింపు ఫలితాలు తొలి రౌండ్ లో వెలువడగా బీజేపీ అనూహ్యంగా దూసుకొచ్చింది. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం బీజేపీ 82, కాంగ్రెస్ 79, జేడీఎస్ 25స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ఇదే ట్రెండ్స్ కొనసాగితే [more]

బ్రేకింగ్: చాముండేశ్వరిలో సిద్ధూ కు చుక్కెదురు

15/05/2018,08:54 ఉద.

ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చాముండేశ్వరి నియోజకవర్గంలో వెనుకంజలో ఉన్నారు. ఆయనపై జేడీఎస్ అభ్యర్థి దేవెగౌడ ముందంజలో ఉన్నారు. వరుణ నియోజకవర్గం నుంచి మారి సిద్ధరామయ్య చాముండేశ్వరిని ఎంచుకున్నారు. చాముండేశ్వరిలో జేడీఎస్ బలంగా ఉంది. ఇక్కడ ఒక్కలిగ కులస్థులు ఎక్కువగా ఉండటంతో ఆయన అనుమానంతో బాదామిలో కూడా పోటీ చేశారు. చాముండేశ్వరిలో [more]

బ్రేకింగ్: గాలి సోదరుల హవా

15/05/2018,08:47 ఉద.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గాలి సోదరుల హవా కొనసాగుతోంది. హరప్పణ హళ్లిలో గాలి జనార్థన్ రెడ్డి సోదరుడు కరుణాకర్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. అలాగే మరో సోదరుడు గాలి సోమశేఖర్ రెడ్డి బళ్లారి టౌన్ నియోజకవర్గంలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బాదామిలో మాత్రం గాలి ప్రధాన అనుచరుడు శ్రీరాములు ప్రస్తుతం [more]

యడ్డీలో అంత కాన్ఫిడెన్స్ ఎందుకో?

12/05/2018,10:00 సా.

యడ్యూరప్ప….బీజేపీలో కన్నడనాట తిరుగులేని నేత. ఈరోజు ఉదయాన్నే ఆంజనేయస్వామిని దర్శించుకుని శికారిపురలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేసి వచ్చారు. అయితే ఆయనలో ఆత్మవిశ్వసాం పూర్తిగా కన్పిస్తోంది. ఈ ఎన్నికల్లో తమదే విజయమన్న ధీమాను వ్యక్తం చేశారు. పైగా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం ఎప్పుడు చేస్తానో కూడా చెప్పేశారు. ప్రమాణస్వీకారానికి ఎవరెవరిని [more]

సిద్ధ‌రామ‌య్య‌.. హిస్టరీని తిర‌గ‌రాస్తారా..!

11/05/2018,10:00 సా.

క‌న్న‌డ‌పోరు చివ‌రి అంకానికి వ‌చ్చింది. పోలింగ్‌కు ఇంకా కొన్ని గంట‌ల స‌మ‌యమే ఉంది. గెలుపుపై ఎవ‌రికివారు ధీమాగా ఉన్నారు. గురువారం సాయంత్రంతో ఎన్నిక‌ల ప్ర‌చారం ముగిసింది. ఈ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌, బీజేపీ, జేడీఎస్ త‌దితర పార్టీలు పోటీ ప‌డుతున్నా.. ప్ర‌ధానంగా కాంగ్రెస్‌, బీజేపీ మ‌ధ్య‌నే హోరాహోరీ పోరు [more]

బీజేపీ బలం పెరుగుతుందిగా….!

10/05/2018,11:59 సా.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సుడిగాలి పర్యటనలతో బీజేపీ కర్ణాటకలో పుంజుకుందా? మేజిక్ ఫిగర్ కు చేరువయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదా? అవుననే అంటున్నాయి సర్వేలు. కర్ణాటకలో నిన్న మొన్నటి దాకా హంగ్ ప్రభుత్వం ఏర్పడుతుందని సర్వేలు తేల్చాయి. కాంగ్రెస్ కర్ణాటకలో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవిస్తుందని, రెండో స్థానాలో బీజేపీ [more]

కాంగ్రెస్ గెలిచినా.. సిద్దూ డౌటే..!

10/05/2018,10:00 సా.

క‌ర్ణాట‌క ఎన్నిలకు కేవ‌లం రెండు రోజులు గురు, శుక్రవారాలు మాత్రమే స‌మ‌యం ఉంది. శ‌నివారం ఉద‌యం 7 గంట‌ల నుంచి ఒకే విడ‌త‌లో ఇక్కడ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ ఎన్నిక‌ల‌ను బీజేపీ, కాంగ్రెస్‌లు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకు న్నాయి. ఏ పార్టీకి ఆ పార్టీ ఇక్కడ గెలుపు గుర్రం [more]

కన్నడ నాట నాడి ఇదేనా?

10/05/2018,05:00 సా.

కన్నడ నాట ఎన్నికల ప్రచారం ముగిసింది. గత ఇరవై రోజులుగా హోరెత్తిన ప్రచారం నేటితో ముగిసింది. మైకులు మూగబోయాయి. అగ్రనేతలు ఇంటి దారి పట్టారు. కర్ణాటక శాసనసభ స్థానానికి ఈ నెల 12వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 223 నియోజకవర్గాలకు జరగనున్న ఈ ఎన్నికలలో జాతీయ పార్టీలైన [more]

1 17 18 19 20 21
UA-88807511-1