యడ్యూరప్ప భావోద్వేగ ప్రసంగమిదే…!

19/05/2018,04:18 సా.

కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప రాజీనామా చేశారు. అంతకుముందు ఆయన అసెంబ్లీలో భావోద్వేగంతో ప్రసంగించారు. ఈ సందర్భంగా చేసిన సుదీర్ఘ ప్రసంగంలో ఆయన మాట్లాడుతూ… ఎన్నికల్లో తాను పెద్దఎత్తున ప్రచారం చేశానని తెలిపారు. బీజేపీకి మద్దతిచ్చిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ధష్ట పరిపాలనను ప్రజలు తీరస్కరించారన్నారు. [more]

బ్రేకింగ్ : కాంగ్రెస్ గెలిచింది….యడ్డీ ఓడారు…..!

19/05/2018,04:11 సా.

ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప రాజీనామా చేశారు. బలపరీక్ష అవసరం లేకుండానే ఆయన రాజీనామా చేసి వెళ్లిపోయారు. ఆయన పదిహేను నిమిషాలు ఉద్విగ్నంగా ప్రసంగించి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి వెళ్లిపోయారు. దీంతో సభ వాయిదా పడింది. కర్ణాటక రాష్ట్రంలో అతిపెద్ద మెజారిటీగా ఆవిర్భవించిన బీజేపీ బలపరీక్ష జరగకుండానే ఓటమి పాలయింది. యడ్యూరప్ప [more]

ఆడియో టేపుల్లో ఏపీ, తెలంగాణ వ్యవహారం

19/05/2018,03:46 సా.

కర్ణాటక ఎన్నికల్లో ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకునేందుకు భారతీయ జనతా పార్టీ శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ఆ పార్టీ ముఖ్యనేతలే కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో బేరసారాలు ఆడుతున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ పలు ఆడియో టేపులను బయటపెట్టింది. వ్యూహాత్మకంగా బలపరీక్షకు ముందురోజు గాలి జనార్ధనరెడ్డి ఆడియో టేపు బయటపెట్టిన [more]

యడ్యూరప్ప రాజీనామా చేస్తారా…?

19/05/2018,03:16 సా.

కర్ణాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప రాజీనామా చేయనున్నారని తెలుస్తోంది. బలపరీక్షకు సమయం దగ్గరపడుతున్నా కావాల్సినంత మంది ఎమ్మెల్యేలను బీజేపీ తమవైపు తిప్పుకోలేకపోయారని వినిపిస్తోంది. బలపరీక్షలో నెగ్గేందుకు బీజేపీ అన్ని రకాలుగా చేసిన ప్రయత్నాలు ఫలించలేదా..అంటే అవుననే సమాధానం వస్తోంది. దీంతో ఇక చేసేదేమీ లేక రాజీనామా చేసేందుకు యడ్యూరప్ప సిద్ధపడ్డారని [more]

బీజేపీ ఫిగర్ పెరిగిందా?

19/05/2018,01:43 సా.

ఇప్పటి వరకూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇద్దరు మాత్రమే బీజేపీకి దగ్గరయ్యారన్న ప్రచారం జరిగింది. అయితే కొద్దిసేపటి క్రితం ఈ ఫిగర్ రెండు నుంచి పదిమందికి చేరినట్లు తెలియడంతో కాంగ్రెస్ పార్టీలో ఆందోళన మొదలయింది. కాంగ్రెస్ కు చెందిన పది మంది ఎమ్మెల్యేలు బీజేపీ నేతలతో టచ్ లో ఉన్నారని [more]

బ్రేకింగ్ : యడ్యూరప్ప ఆడియో కలకలం

19/05/2018,01:30 సా.

యడ్యూరప్పబేరసారాలాడుతూ ఒక ఆడియో టేపును కాంగ్రెస్ పార్టీ విడుదలచేసింది. యడ్యూరప్ప కాంగ్రెస్ ఎమ్మెల్యే బీసీ పాటిల్ తో జరిపిన సంభాషణలను కాంగ్రెస్ పార్టీ విడుదల చేయడం సంచలనం రేకెత్తిస్తోంది. ఒకవైపు బలపరీక్షకు మరో రెండు గంటల సమయం మాత్రమే ఉండగా ఈ ఆడియో టేపులు కర్ణాటకలో కలకలం రేపుతున్నాయి.బీసీ [more]

బీజేపీపై భగ్గుమన్న బాబు

19/05/2018,01:11 సా.

కర్ణాటక పరిస్థితులపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తొలిసారి బహిరంగంగా స్పందించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… కర్ణాటకలో పరిస్థితి దారుణంగా ఉందని, అధికారం కోసం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికల ముందు మోదీ, అమిత్ షా ఏం చెప్పారని, ఇప్పుడు అధికారం కోసం ఏమి చెస్తున్నారని ఆయన ప్రశ్నించారు. [more]

బ్రేకింగ్ : సభ నుంచి మిస్సయిన గాలి…!

19/05/2018,01:00 సా.

కర్ణాటక అసెంబ్లీలో బలపరీక్షకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ పార్టీలకు టెన్షన్ ఎక్కువవుతోంది. అయితే. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఆనంద్ సింగ్, ప్రతాపగౌడ అసెంబ్లీకి హాజరుకాకపోవడంతో ఆ పార్టీ నేతల్లో ఆందోళన మొదలైంది. వీరు సభకు వస్తారని, మాకు మద్దతుగా ఉంటారని కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి [more]

యడ్డీకి వారు అండగా నిలిచారా?

19/05/2018,12:00 సా.

యడ్యూరప్ప ధీమాగా ఉన్నారు. శ్రీరాములు చిరునవ్వులు చిందిస్తూ ఉన్నారు. శాసనసభలో ఎమ్మెల్యేలతో పలకరింపులు. మరోవైపు తమ శాసనసభ్యులను ఎవరెవరు కలుస్తున్నారని జేడీఎస్, కాంగ్రెస్ పార్టీల నిఘా. ఇదీ కర్ణాటక శాసనసభలో పరిస్థితి. కర్ణాటక శాసనసభ సమావేశాలు కొద్దిసేపటి క్రితం ప్రారంభమయ్యాయి. సుప్రీంకోర్టు కూడా ప్రొటెం స్పీకర్ బొపయ్య ఆధ్వర్యంలోనే [more]

బ్రేకింగ్ : యడ్యూరప్పకు ఊరట

19/05/2018,11:17 ఉద.

ప్రొటెం స్పీకర్ నియామకంపై కాంగ్రెస్, జేడీఎస్ లు వేసిన పిటిషన్ సుప్రీంకోర్టు కొట్టివేసింది. కర్ణాటక గవర్నర్ తీసుకున్న మరో నిర్ణయంపై కాంగ్రెస్, జేడీఎస్ లు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ప్రొటెం స్పీకర్ గా బీజేపీకి చెందిన ఎమ్మెల్యే బొపయ్యను నియమించడంపై కాంగ్రెస్, జేడీఎస్ లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. సుప్రీంకోర్టు [more]

1 23 24 25 26 27 36