హరీ….కృష్ణా….వీరి వేదన ఎవరికీ పట్టదా..?

01/09/2018,01:21 సా.

వారంతా నిరుపేద యువకులు. ఉపాది కోసం అప్పోసప్పో చేసి కెమెరాలు కొనుక్కుని ఫోటోగ్రఫీని వృత్తిని కొనసాగిస్తున్నారు. నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదం ఆ యువకులను రోడ్డున పడేసింది. హరికృష్ణ వాహనం ఢీకొన్న మరో వాహనం లో ఉన్న యువకులు అద్రుష్టవాత్తూ ప్రాణాప్రాయం నుంచి బయటపడ్డా… ప్రమాదంలో లక్షల విలువ [more]

ఛీ… ఇదేం సెల్ఫీ పిచ్చిరా నాయనా..!

31/08/2018,02:16 సా.

సెల్ఫీ పిచ్చి సమాజంలో పడిపోతున్న మానవ విలువలకు అద్దం పడుతోంది. సందర్భంతో పని లేకుండా, మానవత్వం మరిచిపోయి సెల్ఫీల మత్తులో మునిగిపోతున్నారు కొందరు. ఈ పిచ్చితోనే కొందరు ప్రాణాల మీదకు తెచ్చుకుంటుండగా, మరికొందరు సెల్ఫీలతో వికృత ఆనందం పొందుతున్నారు. తాజాగా, నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదానికి గురికావడం, నార్కట్ [more]

హరికృష్ణకు ఫోన్ చేసిన వైఎస్…!

30/08/2018,05:32 సా.

రైతు సమస్యలపై నందమూరి హరికృష్ణకు పూర్తి అవగాహన ఉంది. ఆయన 2003లో రైతు సమస్యలను ప్రధానంగా చూపుతూ టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్ అనే సినిమాలో కూడా నటించారు. ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయం ఒక్కటి ఆ చిత్ర దర్శకుడు సముద్ర వెల్లడించారు. ఈ సినిమా కోసం రైతు [more]

భౌతికకాయాన్ని మోసిన చంద్రబాబు, చలమేశ్వర్

30/08/2018,02:11 సా.

నందమూరి హరికృష్ణ అంతిమయాత్ర ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, సుప్రీం కోర్టు పూర్వపు న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్ స్వయంగా హరికృష్ణ భౌతిక కాయాన్ని మోశారు. ప్రత్యేకంగా అలంకరించిన వాహనంతో అంతిమయాత్ర సాగిస్తున్నారు. మెహదీపట్నంలోని ఆయన నివాసం నుంచి జూబ్లీహిల్స్ మహా ప్రస్థానం వరకు అంతిమయాత్ర కొనసాగనుంది. వేలాదిగా [more]

నాగ శౌర్య ఆలోచిస్తే బావుండేదేమో

30/08/2018,11:00 ఉద.

నందమూరి హరికృష్ణ నిన్న బుధవారం తెల్లవారు జామున రోడ్డు ప్రమాదానికి గురై కన్ను మూసిన విషయం తెలిసిందే. 61 ఏళ్లకే నిండు నూరేళ్లు నిండిన హరికృష్ణ మరణానికి ఇండస్ట్రీలోని ప్రముఖులు, రాజకీయనాయకులు, నందమూరి అభిమానులు ఘన నివాళి అర్పిస్తున్నారు. అభిమానులు, కుటుంబ సభ్యుల కన్నీళ్ల మధ్య ఈ రోజు [more]

మొండోడు… మొనగాడు…!

30/08/2018,10:30 ఉద.

అతడంటే ఇంట్లోనూ భయం…పార్టీలోనూ భయం.. చంద్రబాబుకూ భయం. అంతెందుకు అశేష తెలుగు ప్రజల అన్న ఎన్టీయార్ కు కూడా భయం. ఎందుకనేది కొందరిని వేధించే ప్రశ్న. ముక్కుసూటిగా, మొహం మీద కొట్టినట్లుగా మాట్టాడటం అతని నైజం. తెగింపు, మొండితనం, పంతం, పట్టుదల అతని లక్షణాలు. అదే అతని బలం, [more]

హరికృష్ణ అలా మాట్లాడుతుంటే…?

30/08/2018,09:29 ఉద.

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మాజీ రాజ్యసభ సభ్యులు నందమూరి హరికృష్ణ భౌతిక కాయానికి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు నివాళులర్పించారు. కొద్దిసేపటి క్రితం మెహదీ పట్నంలోని హరికృష్ణ నివాసానికి వచ్చిన వెంకయ్యనాయుడు ఆయన మృతిపట్ల విచారం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. నిర్భీతిగా, నిక్కచ్చిగా, ముక్కుసూటిగా వ్యవహరిస్తూ, [more]

ఈ నెల తన జాతకం బాగాలేదని…?

30/08/2018,08:44 ఉద.

జాతకాలను, ముహూర్తాలను విపరీతంగా నమ్మే నందమూరి హరికృష్ణకు ఆహ్వానం హోటల్ అంటే ఎనలేని ఇష్టం. అబిడ్స్ లో ఉండే ఆహ్వానం హోటల్ లోనే ఒక రూమ్ ను హరికృష్ణ ఉంచుకునే వారు. మిగిలినదంతా లీజుకిచ్చినా 1006 రూమ్ నెంబరు గదిని తన వద్దనే ఉంచుకున్నారు. నిత్యం ఆ గదికి [more]

వాటర్ బాటిల్ ప్రాణాలు తీసిందా?

29/08/2018,04:53 సా.

వాటర్ బాటిల్ వెనక్కు తిరగడం వల్లనే నందమూరి హరికృష్ణ ప్రమాదానికి గురయ్యారని పోలీసులు చెబుతున్నారు. ఇదే సమయంలో కారు 160 కిలో మీటర్లు వేగంతో ప్రయాణం చేస్తుంది. దీనితో పాటుగా రోడ్డు మలుపు వుండడం గమనించకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసుల విచారణ లో బయట పడింది. [more]

హరికృష్ణ నివాసానికి కేసీఆర్

29/08/2018,03:39 సా.

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన హరికృష్ణ మృతదేహానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. మొహిదీపట్నం నివాసంలో ఉంచిన హరికృష్ణ పార్ధీవ దేహానికి అనేకమంది ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నార్కేట్ పల్లి లోని కామినేని ఆసుపత్రి నుంచి హరికృష్ణ బౌతికకాయం వెంటనే హైదరాబాద్ చేరుకున్నారు. నందమూరి జానకిరామ్ [more]

1 2 3