రేవంత్ రెడ్డి కేసులో హైకోర్టు అక్షింతలు

05/12/2018,03:06 సా.

తెలంగాణ పోలీసుల వైఖరిపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. రేవంత్ రెడ్డి అరెస్టు వ్యవహారంలో ఇవాళ డీజీపీ మహేందర్ రెడ్డి స్వయంగా హాజరయ్యారు. అయితే, హైకోర్టుకు ఇంటెలిజెన్స్ ఇచ్చిన రిపోర్టుకు సీల్ ఎందుకు లేదని కోర్టు ప్రశ్నించింది. సీల్ లేకుండా రిపోర్ట్ ఇస్తే పోలీసుల అధికారాలు దుర్వినియోగం కాలేదనడానికి [more]

బ్రేకింగ్ : రేవంత్ ఎఫెక్ట్… ఎస్పీ అవుట్..!

05/12/2018,01:35 సా.

రేవంత్ రెడ్డి బలవంతపు అరెస్ట్ పై ఈసీ సీరియస్ అయ్యింది. రేవంత్ అరెస్టు సందర్భంగా వ్యవహరించిన తీరుపై ఈసీ చర్యలు తీసుకుంది. వికారాబాద్ ఎస్పీ టి.అన్నపూర్ణను బదిలీ చేస్తు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. కొత్త ఎస్పీగా అవినాశ్ మహంతిని నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. అన్నపూర్ణ ఎన్నికల విధుల్లో [more]

రేవంత్ వ్యూహం పనిచేయదా..??

05/12/2018,08:00 ఉద.

తెలంగాణ ఎన్నికల్లో రాజకీయ పార్టీలతో పాటు సామాన్య జనం కూడా ఆసక్తికరంగా గమనిస్తున్న నియోజకవర్గం కొడంగల్. ఇక్కడి నుంచి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పోటీ చేస్తుండటం… ఆయనను ఎలాగైనా ఓడించేందుకు టీఆర్ఎస్ టార్గెట్ చేయడంతో ఇక్కడ రాజకీయాల్లో తీవ్ర రూపం దాల్చాయి. ఇక్కడ [more]

ముగ్గురూ రండీ… కొడంగల్ చౌరస్తాలో తేల్చుకుందాం

04/12/2018,06:34 సా.

ఇవాళ తనపై పోలీసులతో కేసీఆర్ చేయించిన దాడి 2 లక్షల మంది కొడంగల్ ప్రజలపై జరిగిన దాడిగా ప్రజలు భావిస్తున్నారని, వారే ఈ దాడిని తిప్పికొడతారని పీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన విడులయ్యాక కొడంగల్ లో మీడియాతో మాట్లాడుతూ… కొడంగల్ లో కేసీఆర్ [more]

గాలి గాళ్లను గెలిపించొద్దు.. కొడంగల్ లో కేసీఆర్

04/12/2018,05:15 సా.

పాలమూరు జిల్లాకు శత్రువులు జిల్లాలోనే ఉన్నారని, వారిని ఈ ఎన్నికల్లో ఓడిస్తేనే జిల్లాకు పట్టిన దరిద్రం పోతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన కొడంగల్ నియోజకవర్గం కోస్గిలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ… కేసీఆర్ ను కొట్టే దమ్ములేక కాంగ్రెస్ పార్టీ ఆంధ్రా నుంచి చంద్రబాబును భుజాలపై [more]

భారీ భద్రత మధ్య కొడంగల్ కు రేవంత్

04/12/2018,04:47 సా.

తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డిని ఎట్టకేలకు పోలీసులు విడుదల చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఆయన స్టార్ క్యాంపెయినర్ అయినందున ఎక్కడైనా ప్రచారం చేసే హక్కు ఆయనకు ఉంటుందని… ఆయనను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ పోలీసులను ఆదేశించడంతో రేవంత్ ను [more]

బ్రేకింగ్: రేవంత్ రెడ్డికి అస్వస్థత

04/12/2018,03:53 సా.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆయనను ఇవాళ తెల్లవారు జామున పోలీసులు అదుపులోకి తీసుకుని జడ్చర్లలో ఉంచారు. ఆయనకు బీపీ పెరగడంతో అస్వస్థతకు గురయ్యారు. దీంతో జడ్చర్లలోని పోలీస్ శిక్షణ కేంద్రంలో చికిత్స అందించారు. ఇవాళ కొడంగల్ లో కేసీఆర్ [more]

రేవంత్ రెడ్డి అరెస్ట్ కి కారణమిదే..!

04/12/2018,01:07 సా.

టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి అరెస్టుపై సీఈఓ రజత్ కుమార్ వివరణ ఇచ్చారు. కేసీఆర్ సభ ఉన్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి బంద్ కి పిలుపునిచ్చారని, టీఆర్ఎస్ ఈ మేరకు తమకు ఫిర్యాదు చేసిందని తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ముందు జాగ్రత్తలో భాగంగానే రేవంత్ రెడ్డిని [more]

ఓటమి భయంతోనే అరెస్టులు..!

04/12/2018,11:50 ఉద.

ఓటమి భయంతోనే రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయించారని కాంగ్రెస్ సీనియర్ నేత ఎస్.జైపాల్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… రేవంత్ రెడ్డిని అరెస్టు చేసిన పద్ధతి సరికాదన్నారు. రేపు కేసీఆర్ కూతురి బెడ్ రూంలోకి పోలీసులు ఇలానే వస్తే కేసీఆర్ ఊరుకుంటారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ [more]

రేవంత్ ను ఎక్కడికి తీసుకెళ్లారు?

04/12/2018,09:55 ఉద.

కాంగ్రెస్ సీనియర్ నేత రేవంత్ రెడ్డి అరెస్ట్ పై ఆయన భార్య గీత అభ్యంతరం వ్యక్తం చేశారు. అర్థరాత్రి ఇంట్లోకి చొరబడి తలుపులు పగలకొట్టి తీసుకెళ్లాల్సిన అవసరం ఏముందని గీత ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో ఇదేనా ప్రజాస్వామ్యం అని ఆమె నిలదీశారు. తమ ఆత్మగౌరవం మీద దెబ్బ కొడితే ఊరుకునేది [more]

1 2 3 4 5 15