కేసీఆర్ పంతం నెరవేర్చిన హైకోర్టు

21/08/2018,12:39 సా.

కాంగ్రెస్ ఎమ్మెల్యేల బహిష్కరణ అంశంలో ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ లను ఎమ్మెల్యేలుగా గుర్తించాలని హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై హైకోర్టు డివిజన్ బెంచ్ స్టే విధించింది. రెండు నెలల పాటు స్టే గడువును నిర్ణయించింది. [more]

ప్రభుత్వానికి గట్టి షాకిచ్చిన హైకోర్టు

14/08/2018,03:37 సా.

కాంగ్రెస్ ఎమ్మల్యేలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ పై అసెంబ్లీ బహిష్కరణ వేటు అంశంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు సింగిల్ బెంచ్ మరోసారి షాక్ ఇచ్చింది. రాష్ట్ర చట్టసభల చరిత్రలోనే తొలిసారిగా హైకోర్టు అసెంబ్లీ స్పీకర్ తో పాటు అసెంబ్లీ కార్యదర్శి, న్యాయ శాఖ కార్యదర్శికి నోటీసులు [more]

బ్రేకింగ్: రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్

27/07/2018,04:41 సా.

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ ల సభ్యత్వ రద్దుపై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు మరోసారి గట్టి షాక్ ఇచ్చింది. ఇద్దరు ఎమ్మెల్యేల సభ్యత్వ రద్దును కొట్టివేస్తూ హైకోర్టు ఇంతకుముందే తీర్పు ఇచ్చింది. అయితే, ఆ తీర్పును ప్రభుత్వం అమలు చేయడం లేదు. వారిని [more]

స్పీకర్ వద్ద జరిగిందిదేనా..?

11/06/2018,07:18 సా.

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ ల సస్పెన్షన్ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ కొత్త దారులు వెతుకుతోంది. స్పీకర్ విధించిన సస్పెన్షన్ ను హైకోర్టు రద్దు చేసింది. అయినా, కూడా తెలంగాణ ప్రభుత్వం వీరి సభ్యత్వాలను పునరుద్ధరించలేదు. దీనికి తోడు టీఆర్ఎస్ పార్టీకి చెందిన [more]

బ్రేకింగ్‌…తెలంగాణ ప్ర‌భుత్వానికి గ‌ట్టి షాక్‌

04/06/2018,11:41 ఉద.

అసెంబ్లీలో జ‌రిగిన సంఘ‌ట‌న‌ల నేప‌థ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కోమ‌టిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంప‌త్ కుమార్ ల బ‌హిష్క‌ర‌ణ వ్య‌వ‌హారంలో తెలంగాణ ప్ర‌భుత్వానికి మ‌రో షాక్ త‌గిలింది. గ‌త అసెంబ్లీ స‌మావేశాల్లో ఎమ్మెల్యేల ప్ర‌వ‌ర్తన అసెంబ్లీ గౌర‌వాన్ని కించ‌ప‌రిచేలా ఉంద‌ని ఆరోపిస్తూ స్పీక‌ర్ బహిష్క‌ర‌ణ వేటు వేసిన విష‌యం తెలిసిందే. [more]

రచ్చ కొనసాగుతూనే వుంది …!

06/05/2018,10:00 ఉద.

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్యెల్యేలు కోమటిరెడ్డి, సంపత్ ల వ్యవహారం హస్తం పార్టీకి తలపోటుగా మారింది. తమకు రాష్ట్ర పార్టీ అండదండలు ఏవంటూ సంపత్ తాజా మరోసారి టి పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ శాసన సభాపక్ష నేత జానారెడ్డిలను ఏకేసారు. పార్టీ లోని ఎమ్యెల్యేలకే న్యాయం [more]

మళ్ళీ మొదటికొచ్చిందే…!

25/04/2018,01:00 సా.

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్యెల్యేలు కోమటిరెడ్డి, సంపత్ సభ్యత్వాల రద్దు వ్యవహారం మళ్ళీ మొదటికొచ్చింది. 12 మంది టీఆరెస్ ఎమ్మెల్యేలు శాసనసభకు స్పీకర్ సుప్రీం అని ఆయన తీసుకునే నిర్ణయంపై కోర్టు కి అధికారం లేదంటూ హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించారు. దాంతో ఈ వివాదంపై తెగేదాకా లాగాలని [more]

బ్రేకింగ్ : కోమటిరెడ్డి, సంపత్ కుమార్ లకు భారీ ఊరట

17/04/2018,01:50 సా.

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ లకు హైకోర్టులో ఊరట లభించింది. వారి శాసనసభ్యత్వాలు రద్దు చెల్లదని హైకోర్టు తీర్పు చెప్పింది. వారిద్దరిని ఎమ్మెల్యేలుగా కొనసాగించాలని తీర్పు చెప్పింది. ఇటీవల జరిగిన తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం సందర్భంగా మైకు విసిరిన ఘటనలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు [more]