ఎవరి బలం ఎంత….?

07/08/2018,11:00 సా.

తమిళనాడులో ఇద్దరు స్టార్ హీరోలు రాజకీయంగా కలిసే అవకాశాలు కన్పించడం లేదు. సినిమాల్లో కలసి నటించినా…. పాలిటిక్స్ లో మాత్రం వేర్వేరుగా పోటీ పడతారన్న టాక్ బలంగా విన్పిస్తోంది. తమిళనాడులో జయలలిత మరణం తర్వాత ఏర్పడిన రాజకీయ శూన్యతను గుర్తించిన స్టార్ హీరోలు కమల్ హాసన్, రజనీకాంత్ లు [more]

తంబిల సత్తా తేలిపోతుంది….!

03/08/2018,11:00 సా.

తమిళనాడులో అధికార, ప్రతిపక్ష పార్టీలకు లోక్ సభ ఎన్నికల కంటే ముందుగానే పెద్ద పరీక్ష ఎదురుకాబోతోంది. లోక్ సభ ఎన్నికలపై ఇప్పటి వరకూ దృష్టి పెట్టిన అన్నాడీఎంకే, డీఎంకేలు ఇప్పుడు స్థానిక సంస్థల్లో తమ సత్తాను చాటుకునేందుకు సిద్ధమవుతున్నాయి. తమిళనాడులో దాదాపు రెండేళ్ల నుంచి స్థానిక సంస్థల ఎన్నికలు [more]

‘‘యూజ్ లెస్’’ పార్టీతో ఇంకెందుకు?

01/08/2018,11:00 సా.

వారిద్దరి వద్ద ఉపయోగం లేదని అర్థమైపోయిందా? వచ్చే ఎన్నికల్లో వీరిని నమ్ముకుంటే నట్టేట మునగడం ఖాయమని తెలిసిపోయిందా…? అందుకనే కమలం పార్టీ వారిని దూరం పెడుతోంది. తమిళనాట అధికారంలో ఉన్న అన్నాడీఎంకే ను బీజేపీ ఇక వదిలేయదల్చుకుందన్న వార్తలు వస్తున్నాయి. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే, బీజేపీ [more]

చిన్నమ్మ…స్కెచ్ తో సెటిల్ అయిపోవడమేనా?

27/07/2018,10:00 సా.

పన్నీర్ సెల్వం పని అయిపోయింది. పళనిస్వామి పనికి రాడంటున్నారు. జయలలిత లేని అన్నాడీఎంకేను ప్రజలు ఆదరించే ప్రసక్తి లేదంటున్నారు అమ్మ మక్కల్ మున్నెట్ర కజగం నేత టీటీవీ దినకరన్. వచ్చే ఎన్నికల్లో టీటీవీ దినకరన్ పార్టీ పొత్తు పెట్టుకునైనా అన్నాడీఎంకే ను ఓడించాలన్న కసితో ఉంది. ఈ మేరకు [more]

దినకరన్ వంటకం ఉడుకుతుందా?

10/07/2018,11:59 సా.

తమిళనాడులో ఈసారి ఎన్నికలు చాలా రంజుగా జరుగుతున్నాయి. అనేక పార్టీలు, అనేక మంది నేతలు…కొత్త పార్టీలు, కొత్త నాయకులు ఇలా తమిళనాడు రాజకీయాలు వచ్చే లోక్ సభ ఎన్నికలు నాటికి రసవత్తరంగా మారనున్నాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. అయితే ముందుగానే లోక్ సభ ఎన్నికలతో [more]

పళని ఆ 8 మందిని పట్టేశారా?

20/06/2018,11:59 సా.

ఉప ఎన్నికలు జరిగితే గెలవడం కష్టమేనని తెలుసు. అలాగని వారిని వదిలేస్తే ఏకు మేకులవుతారనీ తెలుసు. అందుకే వారికోసం బుజ్జగింపులు. తమిళనాడులో అనర్హత వేటు పడిన 18 మంది ఎమ్మెల్యేల్లో ఎనిమిది మంది పళనిస్వామి గ్రూపులో చేరేందేకు రెడీ అయిపోయారన్న ప్రచారం ఊపందుకుంది. 18 మంది ప్రస్తుతం టీటీవీ [more]

దినకరన్ ఊరుకుంటాడా?

15/06/2018,11:00 సా.

తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి సర్కార్ కు ముప్పు ఎప్పుడొస్తుందో తెలియని పరిస్థితి. పన్నీర్ సెల్వాన్నికలుపుకున్నప్పటికీ పళనిస్వామికి త్వరలోనే పదవీ గండం తప్పదన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇప్పుడు తమ వద్ద ఉన్న ఎమ్మెల్యేలు ఎంతమంది ఉంటారో కూడా తెలియని పరిస్థితి.అధికార అన్నాడీఎంకేలో అసమ్మతి ఎమ్మెల్యేలు చాలా మందే ఉన్నారు. ఆర్కే [more]

దినకరన్ నిద్రపోనిచ్చేట్లు లేరే…!

30/05/2018,11:59 సా.

తమిళనాడులో పళనిస్వామి, పన్నీర్ సెల్వం మధ్య గ్యాప్ బాగా పెరుగుతుంది. ఒప్పందం ప్రకారం పళనిస్వామి ముఖ్యమంత్రిగానూ, పన్నీర్ సెల్వం ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టారు. పార్టీకి మాత్రం పన్నీర్ సెల్వం పెద్దగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం తమిళనాడు శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి. పళని, పన్నీర్ ల మధ్య అంత సఖ్యత [more]

వీరిద్దరికీ….ఆ ఇద్దరూ…!

29/05/2018,11:00 సా.

తమిళనాడులో అధికార అన్నాడీఎంకే భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారనుందా? పళనిస్వామి, పన్నీర్ సెల్వం నాయకత్వంపై నెమ్మదిగా భ్రమలు తొలగిపోతున్నాయా? అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. తమిళనాడులో జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే నేతలేని పార్టీగా మారింది. పళనిస్వామి, పన్నీర్ సెల్వం ఉన్నా వారు వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపలేరన్న సంగతి [more]

1 2
UA-88807511-1