Sat May 04 2024 07:15:54 GMT+0000 (Coordinated Universal Time)
Inter Result : తెలంగాణలో ఇంటర్ రిజల్ట్ ఎప్పుడంటే?
పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి. కానీ తెలంగాణలో ఫలితాలు విడుదల కాలేదు
పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి. కానీ తెలంగాణలో ఫలితాలు విడుదల కాలేదు. ఇప్పటికే ప్రశ్నాపత్రాల మూల్యాంకనం పూర్తయిందంటున్నారు. లక్షల మంది తెలంగాణలో ఇంటర్ రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నెల 20వ తేదీ తర్వాత ఎప్పుడైనా విడుదల చేసే అవకాశముందని ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు చెబుతున్నారు.
ఈ నెల 20 తర్వాత...
ఈ ఏడాది ఫిబ్రవరి 28వ తేదీ నుంచి మార్చి 19వ తేదీ వరకూ ఇంటర్ మొదటి, ద్వితీయ పరీక్షలు జరిగాయి. పరీక్షలు జరుగుతుండగానే పేపర్లు దిద్దే ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. అయితే ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్నీ పరిశీలించిన తర్వాతనే ఫలితాలు విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. దీంతో ఈ నెల 20వ తేదీ తర్వాత ఎప్పుడైనా విడుదలయ్యే అవకాశముందని బోర్డు అధికారులు చెబుతున్నారు.
Next Story