Fri May 03 2024 22:29:33 GMT+0000 (Coordinated Universal Time)
హైజాక్ చేస్తున్నాం.. శంషాబాద్ ఎయిర్పోర్టుకు మెయిల్
శంషాబాద్ ఎయిర్పోర్టుకు బెదిరింపు మెయిల్ వచ్చింది. విమానాన్ని హైజాక్ చేస్తున్నట్లు తెలిపారు
శంషాబాద్ ఎయిర్పోర్టుకు బెదిరింపు మెయిల్ వచ్చింది. హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్లే విమానాన్ని హైజాక్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆ మెయిల్ లో పేర్కొనడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే తనిఖీలు నిర్వహించారు. దుబాయ్ వెళ్లే విమానాన్ని భద్రతా సిబ్బంది తనిఖీలు చేస్తున్నారు.
తనిఖీలు ముమ్మరం...
ఎయిర్పోర్టులోనూ భద్రతా సిబ్బంది పెద్దయెత్తున తనిఖీలను నిర్వహిస్తున్నారు. అయితే మెయిల్ పంపిన ఆగంతకుడు ఎవరు? ఎందుకు పంపారు? అన్న దానిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ మెయిల్ ఫేక్ దా? లేదా అన్నది మరికాసేపట్లో తెలియనుంది. దీంతో దుబాయ్ వెళ్లే విమానం కొంత ఆలస్యమయ్యే అవకాశముంది.
Next Story