ఆ ముగ్గురికీ కష్టకాలమే

chandrababu naidu counter on k.chandrasekharrao

నియంతలా మారడం వల్లనే ఆ మూడు పార్టీలూ ప్రజాదరణను కోల్పోయాయని ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. ఆయన కొద్దిసేపటిక్రితం పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఒంటెత్తు పోకడలకు పోవడం వల్లనే భారతీయ జనతా పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలను ప్రజలు ఆదరించడం లేదన్నారు. అభ్యర్థుల ఎంపికలో సమర్థతే ముఖ్యమన్నారు. అతి విశ్వాసంతో వెళితే ఓటమి తప్పదని కేసీఆర్ కు ఆయన పరోక్షంగా చురకలంటించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, తన సామర్థ్యాన్ని, పరిపాలన పట్ల వారు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు. రాజధాని నిర్మాణం కేంద్రం సహకరించకపోవడం వల్లనే ముందుకు వెళ్లడం లేదన్నారు. ప్రత్యేక హోదా కోసమే తాను కాంగ్రెస్ తో చేతులు కలిపానని ఆయన మరోసారి పార్టీ నేతలకు వివరించే యత్నం చేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*