ఇక బాబు హస్తినలో పోరాటం

చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నారు. వచ్చే నెల 2,3 తేదీల్లో ఆయన హస్తినకు వెళ్లి వివిధ జాతీయ పార్టీల నేతలను కలవనున్నారు. ఏపీకి జరిగిన అన్యాయం గురించి వివరించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన అఖిల సంఘాల సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ఢిల్లీ కేంద్రంగా పోరాడాలని కొందరు చంద్రబాబుకు సూచించారు. ఢిల్లీలో ధర్నా చేయాలని చంద్రబాబుకు సూచించారు. అయితే వామపక్ష పార్టీలు మాత్రం తాము టీడీపీతో కలిసి రాలేమని స్పష్టం చేశాయి. హోదాకోసం తమ ఉద్యమం తాము చేసుకుంటామని చెప్పాయి. బీజేపీ ఎంత అన్యాయం చేసిందో, రాష్ట్రానికి టీడీపీ కూడా అంతే అన్యాయం చేసిందని వామపక్ష నేతలు చెప్పారు. అయితే కాంగ్రెస్ మాత్రం హోదా కోసం ఎలాంటి ఉద్యమానికైనా తాము సిద్ధంగా ఉన్నామని చెప్పడం విశేషం. ఇక ఢిల్లీ కేంద్రంగా ఉద్యమించాలని అఖిలసంఘాల సమావేశం నిర్ణయించింది.