ఈ హీరోకు ఆస్తి నష్టం 2 కోట్లు!!

హైదరాబాద్‌లో ఉన్న అన్నపూర్ణ స్టూడియోలో నిన్న సోమవారం ఆరు గంటలకు పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది . అన్నపూర్ణ స్టూడియోస్ లోని రెండవ ఫ్లోర్ కు ఎదురుగా వున్న సెట్ లో సాయంత్రం విద్యుత్‌ షాక్‌ సర్క్యూట్‌ వాళ్ళ ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఇక్కడ ఎలాంటి షూటింగ్ లు జరగటంలేదు . అయితే అక్కడ తగలబడిన ఈ సెట్ ‘మనం ‘ చిత్రం కోసం వేసింది . ఆ చిత్రం తరువాత దీనిని తీసివెయ్యలేదు . చిన్న చిన్న మార్పులు చేస్తూ నిర్మాతలు షూటింగ్ లు చేస్తున్నారు . అతి పెద్ద సెట్ కావడంతో ఇక్కడ అనేక సినిమా షూటింగ్ లు జరుగుతున్నాయి.

షార్ట్ సర్క్యూట్ కారణం….

అయితే రెండవ ఫ్లోర్ కు ఎదురుగా ఖాళీ స్థలం వుంది . అక్కడ అప్పట్లో ఈ సెట్ వేశారు . సాధారణంగా షూటింగ్ లేకపోయినా సెట్ లైట్ కోసం కరెంటు ఉంటుంది . అయితే ఈ ఘటన జరగడానికి షార్ట్ సర్క్యూటే కారణమని… తన తండ్రి జ్ఞాపకార్ధం గా ఉంచుకున్న ఈ ‘మనం’ సినిమా సెట్ మంటల్లో కాలిపోవడం బాధాకరమని అన్నపూర్ణ స్టూడియోస్ ఓనర్ హీరో నాగార్జున మీడీయా కి తెలియజేశారు. అయితే మంటలు అంటుకోగానే అక్కడ వున్న సిబ్బంది గ్రహించి వెంటనే అగ్నిమాపక శాఖకు తెలిపారు . ఐదు ఫైర్ ఇంజనులు హుటాహుటిన స్టూడియోస్ కు వచ్చేటప్పటికి మంటలు ఎగసి పడుతున్నాయి .అయితే గతంలో ఒకసారి ఇదే స్టూడియోలో అగ్ని ప్రమాదం జరిగినా ఈ స్థాయిలో జరగలేదు . ఇది అతి పెద్ద ప్రమాదమని అంటున్నారు . ఆస్తి నష్టం కూడా 2 కోట్ల పైమెరే ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1