ఏపీ విషయంలో మోడీ ఏమన్నారంటే….!

ప్రధాని మోడీతో కేంద్రమంత్రి సుజనాచౌదరి భేటీ ముగిసింది. దాదాపు 20 నిమిషాలపాటు సుజనాచౌదరి భేటీ అయ్యారు. ఏపీకి రావాల్సిన నిధులు, సంస్థలపై చర్చించారు. ఏపీ విభజన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తామని మోడీ హామీ ఇచ్చారు. దీనిపై ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదన్నారు. అవసరమైతే చంద్రాబాబుతో కూడా మాట్లాడతానని మోడీ చప్పారు. గతంలో ఏవైతో చెప్పారో అదే ప్రధాని తిరిగి చెప్పారని సుజనా చౌదరి టీడీపీ ఎంపీలతో చెప్పారు. అయితే తమ నిరసన కొనసాగుతుందని టీడీపీ ఎంపీలు చెబుతున్నారు. ప్రధానితో భేటీ వివరాలను సుజనా చౌదరి చంద్రబాబుకు ఫోన్లో తెలియజేశారు. మరోవైపు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కూడా ప్రధాని మోడీ అపాయింట్ మెంట్ కోరారు.