కార్యక్రమాలన్నీ రద్దు చేసుకున్న చంద్రబాబు…!

చంద్రబాబు అన్ని కార్యక్రమాలనూ రద్దు చేసుకున్నారు. టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దు కృష్ణమ నాయుడి మృతి పట్ల చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో గాలి ముద్దు కృష్ణమ చికిత్స పొందుతూ మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ముద్దుకృష‌్ణమ భౌతిక కాయాన్ని ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి తిరుపతికి తరలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ముద్దుకృష‌్ణమ భౌతిక కాయాన్ని ఆయన స్వగ్రామం చిత్తూరు జిల్లా వెంకటరామాపురానికి తరలిస్తారు. ఈరోజు మధ్యాహ్నానికి చంద్రబాబు వెంకటాపురం చేరుకోనున్నారు. మంత్రులు, టీడీపీ సీనియర్ నేతలు కూడా ముద్దుకృష్ణమ అంత్యక్రియల్లో పాల్గొంటారు. ఈరోజు తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలతో చంద్రబాబు సమావేశం కావాల్సి ఉంది. అయితే ముద్దుకృష్ణమ మృతి కారణంగా దానిని చంద్రబాబు రద్దు చేసుకున్నారు. మిగిలిన కార్యక్రమాలు కూడా రద్దయ్యాయి. రేపు మధ్యాహ్నం ముద్దుకృష్ణమ నాయుడి భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు చెప్పారు.