కేసీఆర్ నిర్ణయాన్ని తప్పుపట్టిన ఎమ్మెల్యే

తెలంగాణ మంత్రివర్గంపై ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న హోంమంత్రి నాయని నరసింహారెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన సమర్థించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సీఎం కేసిఆర్ ను బండ బూతులు తిట్టినోళ్లే నేడు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులగా ఉన్నారని నాయని వ్యాఖ్యానించారు. నాయని వ్యాఖ్యలను శ్రీనివాస్ గౌడ్ వాస్తవమేనని అంగీకరించారు. అది తలచుకుంటేనే కళ్ల వెంట నీళ్లు తిరుగుతున్నాయని శ్రీనివాస్ గౌడ్ ఆవేదన చెందారు. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాల వెనక బలమైన కారణాలు ఉండవచ్చన్నారు. తెలంగాణ ఉద్యోగులు లేనిదే సకలజనుల సమ్మె లేదని, అప్పుడు కనీసం ఉద్యమంలో పాల్గొనని వాళ్లు ఇప్పుడు మాట్లాడుతున్నారని అన్నారు. అయితే ఆంధ్రోళ్ల పెత్తనాన్ని నిరోధించేందుకే కేసీఆర్ ఇలాంటి నిర్ణయాలుతీసుకుని ఉంటారని వ్యాఖ్యానించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1